Monday, December 23, 2024

మంత్రి సెంధిల్ బాలాజీకి గుండె శస్త్ర చికిత్స

- Advertisement -
- Advertisement -

చెన్నై : క్యాష్ ఫర్ జాబ్స్ స్కామ్‌లో అరెస్టయిన తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి చెన్నై లోని ప్రయివేట్ ఆస్పత్రిలో బుధవారం (జూన్ 21) గుండెకు శస్త్రచికిత్స జరుగుతుందని తమిళనాడు ఆరోగ్యమంత్రి మా సుబ్రమణియన్ మంగళవారం వెల్లడించారు. గతవారం డాక్టర్లు పరీక్షించిన వరకు క్లిష్టమైన బ్లాక్‌లు ఉన్నాయని బాలాజీకి తెలియదని సుబ్రమణియన్ చెప్పారు. జూన్ 14న బాలాజీకి కరోనరీ ఆంజియోగ్రామ్ చేశారని, బైపాస్ సర్జరీ చేసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు మంత్రి తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న కావేరీ ప్రైవేట్ ఆస్పత్రి లోని ఆయనకు సర్జరీ చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News