Monday, December 23, 2024

ప్రతి బూత్ స్థాయిలో ప్రత్యేక డ్రైవ్

- Advertisement -
- Advertisement -
  • జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్

కామారెడ్డి ప్రతినిధి: ఓటరు నమోదు మార్పులు, చేర్పులకు ఈ నెల 27, 28 సెప్టెంబర్ 2,3 తేదీలలో ప్రతి బూత్ స్థాయిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని యువత, ఓటర్లు వినియోగించుకునే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. సెకండ్ సమ్మరి రివిజన్ పై బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ పార్టీల రాజకీయ పార్టీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

ఈ నెల 21న డ్రాప్ట్ ఎలక్టోరల్ రోల్ ప్ర చురించబడుతుందని, ఆ ప్రతిని అందరికి అందజేస్తామన్నారు. అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితా వెలువడుతుందని, ఆజాబితా ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఓటరు జాబితాలో పేరులో మార్పులు, చేర్పులకు ఇదే చివరి అవకాశమని, అర్ములైన ప్ర తి యువత ఓటరుగా నమోదయ్యేలా చూడాలన్నారు. జనాభాలో 5 శాతం 18,19 ఏళ్లు నిండిన వారుంటారని, జిల్లాలో రెండున్నర శాతం మాత్ర మే ఓటరుగా నమోదయ్యారని,18 ఏళ్లు నిండిన యువత ఓటరుగా నమోదయ్యేలా చూడాలన్నారు.

కళాశాల స్థాయిలో ఓటరు నమోదుకు జిల్లా యంత్రాంగం స్వీప్ కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు. ప్రతి బూతుస్థాయిలో తమ ప్రతినిధులను ఏజెంట్లుగా నియమించుకోవాలని డ్రాప్ట్ ఓటరు జాబితాను పరిశీలించి మార్పులు, చేర్పులు ఉంటే చేసుకోవాలని సూచించారు. చనిపోయిన వారి పేర్లు ఉంటే తొలగించాలని, ఒకే కుటుంబంలోని ఓటర్లు వివిధ పోలింగ్ బూత్‌లలో ఉంటే సరి చేసుకోవాలన్నారు. ఏమైనా సమస్యలుంటే 1950 టోల్ ప్రీ నెంబరుకు డయల్ చేయాలని దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వివిధ కారణాల వల్ల నియోజకవర్గాల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల ప్రాంతాలను మార్చామ ని,ప్రస్తుతం ఉన్న 790 పోలింగ్ కేంద్రాలకు అదనంగా మరో కేంద్రం ఏర్పాటు చేస్తు న్నామన్నారు.

ఎన్నికల నిర్వహణకు సరిపడా ఈవిఎంలు, వివి ప్యాడ్‌లు అందుబా టులో స్ట్రాంగ్ రూంలో ఉన్నాయని, ప్రతి నెల వాటిని పరిశీలిస్తున్నామని, రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించవచ్చని చెప్పారు. ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే కోడ్ అమ ల్లోకి వస్తుందని ఈ మేరకు రాజకీయ పార్టీల నిబంధనలు పాటించాలని కుల, మత విద్వేశాలకు తావివ్వరాదని వ్యక్తిగత దూషణచేయరాదని, ఓటర్లను నగదు,మద్యంతో ప్రలోబపెట్టరాదని, అభ్యర్థి గరిష్టంగా రూ,40 లక్షలకు ఖర్చు మించకుండా చూసుకో వాలన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఖాసీం అలీ, నరెందర్, నరేష్ గౌడ్, జఫ్ఫార్ ఖాన్, తాహెర్, హరిలాల్, వెంకట్ గౌడ్, బాల్‌రాజు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News