Friday, November 22, 2024

త్రిపురలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం

- Advertisement -
- Advertisement -

అగర్తలా : త్రిపురలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జోరందుకుంది. ప్రద్యోత్ విక్రమ్ మాణిక్య దేవ్ నేతృత్వం లోని తిప్ర మోతా పార్టీ (టిఎంపి) కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. ‘గ్రేటర్ తిప్రలాండ్’ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు సాగించారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రద్యోత్ విక్రమ్ మాణిక్యదేవ్ 2021లో తీవ్రమోతా పార్టీని స్థాపించకముందు త్రిపుర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో విభేదించి గ్రేటర్ తిప్రల్యాండ్ సాధన కోసం సొంత పార్టీని స్థాపించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టిఎంపి పార్టీ 13 స్థానాల్లో విజయం సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News