Wednesday, January 22, 2025

చివరికి అమృత్‌పాల్ సింగ్ అరెస్టు!

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌(30)ను ఆ రాష్ట్ర పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వంద కార్లతో వెంటాడి మరీ అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు ఆరుగురు మద్దతుదారులను కూడా అరెస్టు చేశారు. దీంతో మోఘా జిల్లాలో నేడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు మాత్రం అతడి అరెస్టుపై అధికారిక ప్రకటన చేయలేదు.

ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్‌కు సన్నిహితుడైన లవ్‌ప్రీత్ సింగ్ అలియాస్ తూఫాన్ సింగ్‌ను ఇటీవల పంజాబ్ పోలీసులు ఓ కిడ్నాప్ కేసులో అరెస్టు చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ అమృత్‌పాల్ పిలుపు మేరకు ఫిబ్రవరి 24న పెద్ద సంఖ్యలో యువత అమృత్‌సర్ జిల్లాలోని అజ్‌నాలా పోలీస్టేషన్‌పై దాడికి దిగింది. నిరసనకారుల ఒత్తిడికి వేరే దారిలేక లవ్‌ప్రీత్‌ను పోలీసులు విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత యువతను రెచ్చగొట్టినందుకు అమృత్‌పాల్ సింగ్‌పై రాష్ట్రప్రభుత్వం కేసు నమోదు చేసింది. జి20 దృష్టా ఇన్నాళ్లూ ఎలాంటి చర్యలు అతడిపై తీసుకోలేదు. కానీ నేడు అతడిని, అతడి అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News