Monday, December 23, 2024

ప్రాణాంతక వ్యాధి సెప్సిస్

- Advertisement -
- Advertisement -

మన శరీరంలో బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ తదితర ఇన్‌ఫెక్షన్లు సంభవించినప్పుడు శరీరం ఒక ప్రత్యేక మార్గంలో స్పందిస్తుంది. ఈ ప్రతిచర్య సమయంలో అనేక రకాల ఎంజైమ్‌లు, ప్రొటీన్లు శరీరం విడుదల చేస్తుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడడమే వీటి పని. ఈ నేపథ్యంలో సెప్సిస్ బారిన పడినప్పుడు ఇన్‌ఫెక్షన్‌ను రోగ నిరోధక వ్యవస్థ నియంత్రించ లేదు. దాంతో బ్యాక్టీరియా వేగంగా వ్యాపిస్తుంది. దీంతో ఇన్‌ఫెక్షన్ రక్తం ద్వారా శరీరమంతా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి నివారణలో యాంటీబయోటిక్స్ ఏమాత్రం పనిచేయవు. ఇన్‌ఫెక్షన్ నియంత్రణలో ఉండదు. రోగ నిరోధక వ్యవస్థ కన్నా బ్యాక్టీరియా ప్రభావమే పైచేయి అవుతుంది. ఇది ధమనుల గోడలను దెబ్బతీస్తుంది. రక్తం గడ్డకట్టడం ప్రారంభమవుతుంది.

ఆక్సిజన్ శరీర భాగాలకు చేరదు. ఫలితంగా రక్తంలో ఇన్‌ఫెక్షన్ లేదా విషం పెరిగిపోతుంది. ఈ వ్యాధిలో ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక జ్వరం, దగ్గు, నీరసం వంటివి కనిపిస్తాయి. విశ్రాంతి ఉండదు. రక్తపోటు పెరుగుతుంటుంది. బాధితునికి స్ట్రోక్ వంటివి సంభవిస్తే వెంటనే చికిత్స అందించాలి. ప్రపంచ ఆరోగ్యసంస్థ డేటా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సెప్సిస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య ఏటా 20 శాతం వరకు ఉంటోంది. సెప్సిస్ ను వెంటనే గుర్తించలేం. లోపల్లోపలే మనిషిని చావు వరకు తీసుకెళ్తుంది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా తన చివరిరోజుల్లో సెప్టిక్ షాక్‌కు గురయ్యారు. సెప్టిక్ కావడం అంటే చిన్న దెబ్బ తగిలినా ఇన్‌ఫెక్షన్‌గా మారడాన్ని సెప్టిక్ అంటారు.

ఈ విధంగా శరీరం లోని ఇన్‌ఫెక్షన్ల కారణం గానే సెప్సిస్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. శరీరమంతా ఇన్‌ఫెక్షన్ పాకినప్పుడు మన రోగ నిరోధక వ్యవస్థ తీవ్రంగా స్పందించి పోరాడుతుంది. ఈ పోరాటంలో ఒక్కోసారి అవయవాలు పనిచేయడం మానేస్తాయి. దీన్నే సెప్టిక్ షాక్ అంటారు. ఇది చివరకు మరణానికి దారి తీయవచ్చు. సెప్సిస్‌ను గుర్తించ డానికి సరైన విధానం ఏదీ లేదు. మధ్య ప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో వారం రోజుల్లో రెండు మగ చీతాలు మృతి చెందిన సంగతి తెలిసిందే. సెప్టిసిమియా ఇన్‌ఫెక్షన్ వల్లనే ఇవి చనిపోయాయని దక్షిణాఫ్రికా చీతా సంతతి ప్రాజెక్టు నిర్వాహకులు విన్సెంట్ వాన్‌డెర్ మెర్వ్ స్పష్టం చేయడం ఈ సందర్భంగా గమనించవలసి ఉంది. సెప్సిస్ వ్యాధి నుంచే సెప్టిసిమియా ఇన్‌ఫెక్షన్ వ్యాపిస్తుందని తెలుసుకోవడం చాలా అవసరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News