హైదరాబాద్: తెలంగాణ జాతీయ సమైఖ్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్రంలోని 199 శాసనసభ నియోజకవర్గాల్లో అత్యంత ఉత్సాహంగా జాతీయ సమైఖ్యాత ర్యాలీలను వైభవంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో జాతీయ సమైక్యతా వజ్రొత్స వాలు జరుపుతున్నాం. ఒక్క అసెంబ్లీ నియోజక వర్గంలో 15 వేల మంది ర్యాలీలో పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 17పై అందరికీ అవగాహన కలగాలి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భ్రహ్మాండంగా పురోగతి సాధిస్తోంది అని తెలిపారు. అనంతరం ఎంఎల్ఏ దానం నాగేందర్ మాట్లాడుతూ.. నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంతో.. కేసీఆర్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు. పార్లమెంట్ కు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేశామని దానం తెలిపారు. ఈ సందర్బంగా నిర్వ్హయించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, జీహెచ్ ఎంసీ ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం, మంత్రులు, ప్రజాప్రతినిధులు సమావేశానికి హాజరైన వారితో కలసి సామూహిక బోజనాలను చేశారు.
సెప్టెంబర్ 17పై అందరికీ అవగాహన కలగాలి: సిఎస్
- Advertisement -
- Advertisement -
- Advertisement -