తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వరక్స్‌పై డి మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రలో కనిపించనున్నారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 17న ఓదెల2 థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ హెబ్బా పటేల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘కరోనా సమయంలో ఒక చిన్న ప్రయత్నంగా మొదలు పెట్టిన ఓదెల ఘనవిజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఇంత గ్రాండ్ స్కేల్లో సీక్వెల్ ఓదెల 2ని ప్రేక్షకులకు ముందు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది.
ఓదెల1 అవుట్ అండ్ అవుట్ మర్డర్ మిస్టరీ. ఓదెల 2 సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఓదెల కంటే ఓదెల2 సినిమాలో చాలా అద్భుతమైనటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఆడియన్స్ కి గ్రేట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది.ఇందులో తమన్నాతో నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. తను నా సిస్టర్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. అయితే సినిమాలో ఎక్కువ శాతం నేను జైల్ ఎపిసోడ్స్ లో కనిపిస్తాను. సంపత్ విజనరీ ఫిలిం మేకర్. ఆయన ఫస్ట్ ఓదెల కథలో నా క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకే షాకింగ్ అనిపించింది. అంత పర్ఫార్మెన్స్ బేస్డ్ క్యారెక్టర్ నేను చేయగలనా? అనిపించింది. అయితే సంపత్ ప్రయత్నించమని చెప్పారు. ఆయన నాపై అలాంటి నమ్మకాన్ని ఉంచడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమా ముహూర్తాన్ని కాశీలో చేయడం జరిగింది. అలాగే టీజర్‌ని కుంభమేళాలో లాంచ్ చేసాం. ఈ కథ ఆధ్యాత్మికత, భక్తి భావంతో ముడిపడి ఉంటుంది‘ అని అన్నారు.