Thursday, December 19, 2024

జై హనుమాన్ కి సీక్వెల్… వీడియో రిలీజ్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ

- Advertisement -
- Advertisement -

సంక్రాంతికి బరిలోకి దిగి, పెద్ద సినిమాలతో  పోటీ పడి సక్సెస్ సాధించిన జై హనుమాన్ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ ఒక ఊపు ఊపుతోంది. ప్రశాంత వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా రూపొందిన జై హనుమాన్ కి సీక్వెల్ కూడా ఉంటుందని అప్పట్లోనే నిర్మాతలు ప్రకటించారు. దాంతో అభిమానులు సీక్వెల్ అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సీక్వేల్ షూటింగ్ లో భాగంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ అంజనాద్రి 2.0 రూపొందిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. దీనికి ‘వెల్కమ్ టు అంజనాద్రి 2.0’ అనే క్యాప్షన్ ను జత చేశారు. ఈ వీడియోకి రఘు నందన.. రఘు నందన అనే పాటను యాడ్ చేశారు. చుట్టూ కొండలతో, మధ్యలో సరస్సు, ఆ సరస్సులో బోలెడు పడవలతో రమణీయంగా కనిపిస్తున్న ప్రకృతిని కనువిందుగా చూపిస్తూ ఈ సీన్ షూట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News