Saturday, December 21, 2024

మైథలాజికల్ మూవీకి సీక్వెల్

- Advertisement -
- Advertisement -

Sequel to Mythological Movie

 

క్రేజీ సినిమాలకు సీక్వెల్స్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా మరో భారీ చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ తెలిసింది. ఈ స్టార్ నటిస్తున్న బిగ్ మూవీ ‘ఆదిపురుష్’కు కూడా సీక్వెల్ రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్‌లో వస్తున్న తొలి మైథలాజికల్ మూవీ ఇది.

రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్‌కి సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయి. ఇందులో హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ నటిస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. అవతార్ తరహా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందుతున్న ఈ చిత్రానికి విఎఫ్‌ఎక్స్ వర్క్ కీలకంగా మారడంతో ఫాస్ట్‌గా షూటింగ్ పూర్తి చేసిన దర్శకుడు ఓం రౌత్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా వున్నాడట. విఎఫ్‌ఎక్స్ కారణంగా రిలీజ్ ఆలస్యం కానున్న ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి 12న ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

ఇప్పటికే చిత్ర బృందం రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించింది కూడా. అయితే ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేస్తూనే దర్శకుడు ఓం రౌత్ ఈ మూవీ సీక్వెల్ ని తెరపైకి తీసుకురావాలన్న ఆలోచనని ప్రభాస్ కు చెప్పాడట. ఈ ఆలోచన నచ్చడంతో ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో దర్శకుడు స్క్రిప్ట్‌పై కసరత్తులు చేయడం మొదలు పెట్టాడట. కథ పూర్తి కాగానే వచ్చే ఏడాది ఈ సీక్వెల్ ని పట్టాలెక్కించాలనే ప్లాన్ లో దర్శకుడు వున్నాడని… ప్రభాస్ కూడా సీక్వెల్‌కు డేట్స్‌ని కేటాయించడానికి రెడీ అవుతున్నాడని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సలార్,ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు కూడా వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News