Sunday, December 22, 2024

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సెర్బియా ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

ఫిబ్రవరిలో బెల్‌గ్రేడ్‌లో జరిగే ఐటిఎఫ్‌కు రావాలని సెర్బియా పర్యాటక మంత్రి లేఖ

మన తెలంగాణ/హైదరాబాద్: భారత పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి సెర్బియా పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానం అందింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు బెల్‌గ్రేడ్‌లో జరిగే 45వ ఇంటర్నేషనల్ టూరిజం ఫెయిర్‌కు హాజరు కావాలని ఆదేశ పర్యాటక శాఖ మంత్రి హుసేన్ మెమిక్ ఆహ్వానం పంపించారు. యూరప్, సెర్బియా ప్రాంతంలో పర్యాటక రంగాభివృద్ధికి జరిగే అతిపెద్ద ఈవెంట్కా ఇది. గత 30 ఏళ్లుగా ఈ కార్యక్రమం జరుగుతోండగా ఈసారి ‘అడ్వెంచర్ బిగిన్స్ హియర్’ అనే థీమ్‌తో జరగనుంది. వివిధ దేశాలనుంచి పర్యాటక శాఖల మంత్రులు, ఈ రంగానికి సంబంధించిన భాగస్వామ్య పక్షాలు, పెట్టుబడిదారులు ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో పాల్గొననున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News