Saturday, November 23, 2024

క్వార్టర్స్‌లో సెరెనా, జకోవిచ్

- Advertisement -
- Advertisement -

Serena Williams Novak Djokovic Reach Australian Open Quarterfinals

 

ఒసాకా, హలెప్ కూడా ముందంజ, థీమ్ ఇంటికి

మెల్బోర్న్: మహిళా టెన్నిస్‌లో ఒకప్పుడు తిరుగులేని తారగా మెరిసిన సెరెనా విలియమ్స్ ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత గత ఫామ్‌ను కొనసాగించలేకపోతుండడం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా ఓపెన్‌లో పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న సెరెనా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం బలారస్‌కు చెందిన ఆర్యనా సబలెంకాతో జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో అతికష్టం మీద విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. 6-4, 26,64 స్కోరుతో సెరెనా విజయం సాధించినప్పటికీ ప్రతిపాయింట్‌కూ చెమటోడ్చాల్సి వచ్చింది. ఆదివారం జరిగిన ఇతర నాలుగో రౌండ్ మ్యాచ్‌లలో మూడో సీడ్, జపాన్‌కు చెందిన నయోమి ఒసాకా, రెండో సీడ్ సైమోనా హలెప్‌లు కూడా ప్రత్యర్థులపై విజయాలతో క్వార్టర్‌ఫైనల్‌కు చురుకున్నారు. గార్బిన్ ముగురుజాతో జరిగిన మ్యాచ్‌లో 64, 46, 75 ఒసాకా విజయం సాధించగా, ఇగా స్వియాటెక్‌తో జరిగిన మరో నాలుగో రౌండ్ మ్యాచ్‌లో తొలి టెస్టును 36 స్కోరుతో కోల్పోయినప్పటికీ ఆ తర్వాతి రెండు సెట్లను 61,64స్కోరుతో సునాయాసంగా దక్కించుకొని క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది.

ఇక పురుషుల సింగిల్స్ విభాగంలొ టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జకోవిచ్ కెనడాకు చెందిన బలమైన సర్వ్ చేసే వాళ్లలో ఒకడుగా పేరు తెచ్చుకున్న మిలోస్ రవోనిక్‌పై నాలుగు సెట్ల హోరాహోరీ పోరులో గెలుపొంది క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గాయంతో బాధపడిన జకోవిచ్ ఈ మ్యాచ్‌లో మాత్రం ఎక్కడా అసౌకర్యానికి గురైనట్లు కనిపించలేదు. తొలి సెట్‌ను 76టైబ్రేకర్‌తో దక్కించుకున్న జకోవిచ్ ఆ తర్వాతి సెట్‌ను 4 6స్కోరుతో చేజార్చుకున్నాడు. అయితే ఆ తర్వాత చెలరేగిన జకోవిచ్ 61,64 స్కోరుతో సునాయాసంగా విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో ఆరో సీడ్, జర్మనీకి చెందిన జ్వెరేవ్64, 76,63స్కోరుతో వరస సెట్లలో దుసాన్ లజోవిక్‌పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. అయితే మూడో సీడ్ డొమినిక్ థీమ్ నాలుగో రౌండ్‌లోనే టోర్నమెంట్‌నుంచి నిష్క్రమించాడు. బల్గేరియాకు చెందిన గ్రిగోర్ దిమిత్రోవ్‌తో జరిగిన మ్యాచ్‌లో64,64,60 స్కోరుతో వరస సెట్లలో ఓటమి పాలై టోర్నమెంట్‌నుంచివైదొలిగాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News