న్యూయార్క్: త్వరలో ఆరంభమయ్యే ప్రతిష్టాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి మరో స్టార్ తప్పుకుంది. మహిళల విభాగంలో దిగ్గజ క్రీడాకారిణిగా పేరు తెచ్చుకున్న అమెరికా వెటరన్ స్టార్ సెరెనా విలియమ్స్ అమెరికా ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్టు బుధవారం అధికారికంగా ప్రకటించింది. తొడ కండరాల గాయం మళ్లీ తిరగ బడడంతో యూఎస్ ఓపెన్‌కు దూరం కాక తప్పడం లేదని సెరెనా పేర్కొంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకోవడం తనను ఎంతో బాధకు గురి చేస్తుందని పేర్కొంది. అయితే గాయం తిరగబడడంతో టోర్నీ నుంచి వైదొలగడం మినహా తనకు మరో మార్గం లేకుండా పోయిందని సెరెనా ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలావుండగా ఇప్పటికే పురుషుల సింగిల్స్‌లో అగ్రశ్రేణి క్రీడాకారులు రఫెల్ నాదల్, డొమినిక్ థిమ్, రోజర్ ఫెదరర్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఇదిలావుండగా మహిళ సింగిల్స్ విభాగంలో ఇప్పటికే 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన సెరెనా రికార్డు విజయానికి టైటిల్ దూరంలో నిలిచింది. కొన్నేళ్లుగా ఈ టైటిల్ కోసం ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది.
యూఎస్ ఓపెన్‌కు సెరెనా దూరం
- Advertisement -
- Advertisement -
- Advertisement -