Sunday, January 19, 2025

సీరియల్ నటుడు చందు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ కాలనీలో సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. త్రినయినితో పాటు పలు సీరియల్స్ లో చందు నటించారు. 2015లో శిల్పను చందు ప్రేమ వివాహం చేసుకున్నారు. చందుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పవిత్రతో కలిసి బెంగళూరు  నుంచి హైదరాబాద్ కు వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో చందు తీవ్రంగా గాయపడడంతో పవిత్ర షాక్ గురై గుండెపోటుతో చనిపోయింది. ఆరేళ్లుగా చందుకు టీవీ నటి పవిత్ర జయరాంతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్ లో అతడు నటిస్తున్నారు. ఆత్మహత్య కు కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News