హైదరాబాద్: నిర్మానుష్య ప్రాంతంలో ఒంటరిగా ఉండే మహిళలే లక్ష్యంగా హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్ సైకోను టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడు రాములుపై 16 హత్యలు, నాలుగు దొంగతనం కేసులు ఉన్నట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. భార్య వదిలేయడంతోనే మహిళలను లక్ష్యంగా చేసుకున్నాడన్న సిపి 2003 నుంచి వరస నేరాలకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. జీవిత ఖైదు అనుభవిస్తూ హైకోర్టుకు వెళ్లి గతేడాది జూలైలో విడుదలైన రాములు జైలు నుంచి వచ్చిన 5 నెలల్లోనే మరో ఇద్దరు మహిళలను హతమార్చినట్టు అంజనీ కుమార్ వెల్లడించారు. మొదటి భార్య వదిలేయడంతో మహిళలపై కక్ష పెంచుకుున్నాడని సిపి పేర్కొన్నారు. 15 రోజుల క్రితం అంకుశాపూర్ వద్ద గుర్తు తెలియని మహిళ హత్య కేసు దర్యాప్తులో సీరియల్ కిల్లర్ ఘాతుకాలు వెలుగులోకి వచ్చినట్టు సిపి మీడియాకు వివరించారు.
Serial killer Arrested by Task Force Police