- Advertisement -
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ శివారులో ఎన్ కౌంటర్ జరిగింది. ఓ సీరియల్ కిల్లర్ ను ఢిల్లీ పోలీసులు హతమార్చారు. గురువారం రోహిని సెక్టార్ 29-30లో సీరియల్ కిల్లర్ కామిల్ ఉన్నట్లు సమాచారంతో వెళ్లిన పోలీసులు లొంగిపోవాలని సూచించారు. అయితే నిందితుడు పొలీసులపై కాల్పులు జరుపుతూ బైక్ పై పారిపోయేందుకు యత్నించాడు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో కామిల్ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలంలో నిందితుడి వద్ద నుంచి టర్కీ మేడ్ గన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -