Thursday, December 26, 2024

గుజరాత్‌లో సీరియల్ కిల్లర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలులో ఒక మహిళను లూటీ చేసి హత్యచేసిన ఈక సీరియల్ కిల్లర్‌ను గుజరాత్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. గుజరాత్‌లోని వల్సద్ జిల్లాలో ఒక 19 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన సీరియల్ కిల్లర్‌ను అరెస్టు చేశామని, నాలుగురు రాష్ట్రాలలో జరిగిన హత్యలతో నిందితుడికి సంబంధం ఉందని ఒక పోలీసు అధికారి సోమవారం తెలిపారు. హర్యానాలోని రోహతక్‌కు చెందిన రాహుల్ జాట్ ఈ హత్యలకు పాల్పడినట్లు ఆ అధికారి చెప్పారు. నవంబర్ 14న ఉద్వాడ రైల్వే స్టేషన్ సమీపంలోని పట్టాలపై ఒక 19 ఏళ్ల బాలిక మృతదేహం లభించిందని, ట్యూషన్ ముగించుకుని సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్న ఆబాలికపై వెనుక నుంచి దాడి చేసి హత్యాచారానికి నిందితుడు పాల్పడ్డాడని ఆ అధికారి తెలిపారు.

ఆదివారం రాత్రి వాపి రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్లేస్‌లో రాహుల్ జాట్‌ను అరెస్టు చేశామని, అంతకు ముందురోజే నిందితుడు సికింద్రా రైల్వే స్టేషన్ సమీపంలో ఒక రైలు మహిళను లూటీ చేసి హత్య చేశాడని ఆయన చెప్పారు. మహారాష్ట్రలోని సోలాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక రైలులో ఒక మహిళపై అత్యాచారం జరిపి నిందితుడు హతమార్చాడని ఆయన చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా రైల్వే స్టేషన్ సమీపంలో కటిహార్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక వృద్ధుడిని కత్తిపో పొడిచి హత్య చేశాడని, కర్నాటకలోని ముల్కీలో ఒక రైలు ప్రయాణికుడిని హత్య చేశాడని ఆయన చెప్పారు హర్యానా, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్‌లో కూడా నిందితుడిపై డజనుకుపైగా కేసులు నమోదయ్యాయని ఆయన తలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News