Saturday, November 2, 2024

అఫ్గానిస్థాన్‌కు సిరీస్

- Advertisement -
- Advertisement -

చిట్టగాంగ్ : బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన రెండో వన్డేలో అఫ్గానిస్థాన్ 142 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో అఫ్గానిస్థాన్ మరో వన్డే మిగిలివుండగానే 20 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీం జర్దాన్‌లు సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 256 పరుగుల రికార్డు పార్ట్‌నర్‌షిప్‌ను నెలకొల్పారు.

ధాటిగా ఆడిన గుర్బాజ్ 125 బంతుల్లోనే 13 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో 145 పరుగులు చేశాడు. మరోవైపు ఇబ్రహీం జర్దాన్ 9 ఫోర్లు, సిక్సర్‌తో 100 పరుగులు సాధించాడు. అయితే ఆ తర్వాత బంగ్లా బౌలర్లు విజృంభించడంతో అఫ్గాన్ ఆశించిన స్థాయిలో భారీ స్కోరును సాధించలేక పోయింది. కాగా, తర్వాత లక్షఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 43.2 ఓవర్లలో 189 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వికెట్ కీపర్ ముష్ఫికుర్ రహీం (69) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అఫ్గాన్ బౌలర్లలో ఫజల్ హక్, ముజీబుర్ రహ్మాన్ మూడేసి వికెట్ల తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News