Saturday, December 21, 2024

అభివృద్ధిలో అగ్రగామి శేరిలింగంపల్లి : ఎమ్మెల్యే గాంధీ

- Advertisement -
- Advertisement -

కూకట్‌పల్లి: కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేస్తు అభివృద్ధిలో ‘శేరిలింగంపల్లి’ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలబెట్టామని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గురువారం నియోజకవర్గంలోని కూకట్‌పల్లి సర్కిల్‌కు చెందిన హైదర్‌నగర్ డివిజన్‌లోని పలువ ప్రాంతాల్లో సిసి రోడ్డు నిర్మాణ పనులకు స్ధానిక కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్‌తో కలిసి ఎమ్మెల్యే గాంధీ శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడంతో పాటుగా కోట్లాది రూపాయలతో అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్‌లు ప్రతీ నిత్యం అభివృద్ధికే ప్రాధాన్యతనిస్తారన్నారు. గత పాలకుల హయాంలో కనిపించని అభివృద్ధి బిఆర్‌ఎస్ హయాంలో జరిగిందని గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులతో పాటుగా డివిజన్ గౌరవాధ్యక్షుడు దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పోతుల రాజేందర్ స్ధానిక నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News