Monday, December 23, 2024

శేరిలింగంపల్లిలో భార్య గొంతు కోసి చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భార్యను భర్త వెంబడించి గొంతు కోసి హత్య చేసిన సంఘటన రంగారెడ్డిలోని శేరిలింగంపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నల్లగండ్ల ప్రాంతంలో నరేందర్(30), అంభిక(26) అనే దంపతులు నివసిస్తున్నారు. భార్యభర్తలకు ఐదేళ్ల కూతురు ఉంది. దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతుండడంతో నరేందర్ తాండూరు వెళ్లిపోయి అక్కడే ఉంటున్నాడు. భార్య మాత్రం నల్లగండ్లలోనే ఉంటుంది. శుక్రవారం భార్య వద్దకు నరేందర్ వచ్చాడు. ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో నరేందర్ రాయి తీసుకొని అంభిక తలపై కొట్టాడు. ప్రాణభయంతో ఆమె పరుగులు తీసింది. ఆమెను కొంచెం దూరం వెంబడించి కత్తి తీసుకొని ఆమె గొంతును కోశాడు. దీంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఐ శ్రీధర్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: పోలీస్ స్టేషన్‌లో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎస్‌ఐ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News