Wednesday, January 22, 2025

శేరిలింగంపల్లిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా

- Advertisement -
- Advertisement -

మాదాపూర్ : ప్రజల సంక్షేమం, అభివృద్ధ్దికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధ్దితో పని చేస్తుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం హఫీజ్‌పేట్, మాదాపూర్ రెండు డివిజన్లలోని వివిధ కాలనీలలో 8 కోట్ల 58లక్షల 10వేల రూపాయలతో చేపట్టబోయే పనులకు మాదాపూర్, హఫీజ్‌పేట్ డివిజన్ల కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, పూజితలతో కలిసి శంకుస్థాపన చేశారు. హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలో ని ఓల్డ్ హఫీజ్‌పేట్, ఇంద్రారెడ్డి ఆల్విన్‌కాలనీ, హుడా కాలనీ, దత్తసాయి ఎన్‌క్లేవ్, ఆర్టీసి కాలనీ, రామకృష్ణనగర్, మైత్రినగర్ ఫేస్ 3, వైశాలినగర్, ఉషోద య ఎన్‌క్లేవ్, ప్రజయ్ సిటి, జనప్రియ నగర్, యూత్ కాలనీ, సాయినగర్ కాలనీలలో 4కోట్ల 42లక్షల 70వేల రూపాయలతో సిసి రోడ్లుకు, మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యనగర్, సు భా ష్ చంద్రబోస్ నగర్, భిక్షపతి నగర్, కాకతీయ హిల్స్, సిద్దివినాయక నగర్, దోబీ ఘాట్, అయ్యప్ప సోసైటీ, గుట్టల బే గంపేట్ తదితర కాలనీలలో 4కోట్ల 15లక్షల 40వేల రూపాయలతో చేపట్టను న్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్లుతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధ్దితో పని చేస్తుందన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్‌ల సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధ్ది చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిదుతామన్నారు. మాదాపూర్, హఫీజ్‌పేట్ డివిజన్ల పరిధిలోని వివిధ కాలనీలలో సిసి రోడ్ల నిర్మాణంతో కాలనీ రోడ్ల సమస్యల పరిష్కరం అవుతుందన్నారు. ప్రతి కాలనీకి మౌ లిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. సిసి రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలన్నారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్దికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో హఫీజ్‌పేట్ డివిజన్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్‌గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్, వాలా హరీష్‌రావు, సాంబశివరావు, గుమ్మడి శ్రీనివాస్, రాంచందర్, కృష్ణ ,శ్యా మ్, అంకారావు, రాములు యాదవ్, సత్యనారాయణ, నర్సింహ, బాబుమి యా, ముక్తర్, మునఫ్, లియకత్, మియాన్, సలీం, కృష్ణ యాదవ్, అప్పల్‌రా జు యాదవ్, లకా్ష్మరెడ్డి, నల్ల సంజీవరెడ్డి, యాదగిరిగౌడ్,ప్రసాద్, రఘునాథ్, వార్డ్ మెంబర్ శేఖర్ ముదిరాజ్, సుదర్శన్, మల్లారెడ్డి, ప్రవీణ్, కృష్ణ, వెంకట్, జ్ఞానేశ్వర్, మల్లేష్, దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News