Monday, December 23, 2024

అంగన్‌వాడీ టీచర్‌పై చర్యలు : సత్యవతిరాథోడ్

- Advertisement -
- Advertisement -

Serious action on Anganwadi teacher

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని బూర్గుపాడు అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారి వాసవి (4) చేతిపై గరిటతో వాత పెట్టిన అంగన్‌వాడీ టీచర్ హైమవతిని సస్పెండ్ చేయాలని అధికారులను రాష్ట్ర స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ ఆదేశించారు. పాప చేతిపై వేడి గరిటతో వాత పెట్టడంపై మంత్రి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అంగన్‌వాడీ టీచర్లకు కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నతాధికారులకు సూచించారు. పాపకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News