Thursday, January 23, 2025

ట్రాఫిక్ జాం కాకుండా చర్యలు తీసుకోవాలి: స్టిఫెన్ రవీంద్ర

- Advertisement -
- Advertisement -

రోడ్డు సేఫ్టీపై సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర
పాల్గొన్న ట్రాఫిక్ పోలీసులు
Serious action on Traffic jam

మనతెలంగాణ, సిటిబ్యూరో: ఐటి కారిడార్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుకోకుండా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర స్టిఫెన్ రవీంద్ర అన్నారు. రోడ్డు సేఫ్టీపై గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర మాట్లాడుతూ వ్యాపారాలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు మళ్లీ ప్రారంభమయ్యాయని తెలిపారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కార్యాలయాలకు వస్తున్నారని, ఐటి కారిడార్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ట్రాఫిక్ ఎలాంటి అవాంతరాలు ఎదుర్కోకుండా ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కొత్తగా నిర్మించిన లింక్ రోడ్లపై సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాహనదారులు కొత్త రోడ్లను ఉపయోగించుకునేలా చేయాలని కోరారు. ఐటి కారిడార్‌లోని ట్రాఫిక్ పోలీసులు ఐటి కంపెనీల ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. వారిని అడిగి కార్యాలయాల సమయాలను తెలుసుకుని ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు ప్రణాళికను రూపొందించుకోవాలని అన్నారు. ఎస్‌సిఎస్‌సి వలంటీర్లను ట్రాఫిక్ విధుల్లో ఉపయోగించుకోవాలని కోరారు.

అన్ని డిపార్ట్‌మెంట్‌ల అధికారులతో సమన్వయం చేసుకుని, రోడ్డు సేఫ్టీపై చర్యలు తీసుకోవాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు డేంజరస్ డ్రైవింగ్, మద్యం తాగి వాహనాలు నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ తదితరాలపై నిఘా పెట్టాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులను రోడ్లపై విధులు నిర్వర్తించేలా చేయాలని అన్నారు. ట్రాఫిక్ పోలీసులకు ఆధునిక టెక్నాలజీ గ్యాడ్జెట్స్‌ను అందజేస్తామని తెలిపారు. సమావేశంలో ఎడిసిపి శ్రీనివాస్ రెడ్డి, ఎసిపిలు హన్మంతరావు, విశ్వప్రసాద్, చంద్రశేఖర్ రెడ్డి, ఇన్స్‌స్పెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News