Sunday, December 22, 2024

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -
  • ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం

వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లాలో బుధవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టడంతో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఒకరు తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రమాద ఘటనకు కారణాలను పరిశీలించారు. లారీ డ్రైవర్ అజాగ్రత్త వలనే ప్రమాదం జరిగి ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.

బతుకుదెరువు కోసం బీహర్ నుండి వచ్చిన వలస కూలీలు స్థానికంగా ఊరురు తిరుగుతూ తేనె పట్టును అమ్ముకొని జీవనం పోషించుకుంటున్నారని, ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఏడుగురు వ్యక్తులతో తొర్రూర్ వైపునకు వెళుతున్న ఆటోను తొర్రూరు వైపు నుండి వరంగల్‌కు వస్తున్న లారీ వర్థన్నపేట మండలం ఇల్లంద వద్ద ఎదురుగా వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సహా అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన మరో ముగ్గురిని వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించగా ఇద్దరు మృతి చెందారు.

మరొకరు చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నారు. మృతుల్లో ఆటో డ్రైవర్ వరంగల్ శివనగర్‌కు చెందిన బట్టు శ్రీనివాస్ అని, మిగతా ఐదుగురు తేనె పట్టును అమ్ముకుంటు జీవనం పోషించుకుంటున్న జాబోద్, సురేష్ బీహార్, నితీష్, మేరీ బీహార్, రూప్‌చంద్‌లుగా గుర్తించినట్లు, అమర్ అనే కూలి వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సిపి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News