Thursday, January 23, 2025

దేశంలోనే ఉద్యోగులకు అధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలోనే ఉద్యోగులకు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగులకు కొత్త పే స్కేల్ అమలుకు ఉత్తర్వులు జారీ చేసినందుకు సెర్ప్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు సెర్ప్ ఉద్యోగుల డిమాండ్లను ఏనాడు పట్టించుకోలేదన్నారు.

స్వరాష్ట్రంలో సిఎం కెసిఆర్, సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించేందుకు నిర్ణయించి వారి జీవితాల్లో వెలుగులు నింపారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఉద్యోగులకు అధికంగా వేతనాలు చెల్లిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో 3,978 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరిందన్నారు.  ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త పేస్కేల్ ప్రకారం జీతాలు చెల్లించనున్నట్టు కవిత తెలిపారు. సెర్ప్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్ రెడ్డి తదితరులు ఎమ్మెల్సీ కవితను కలిశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News