Friday, November 15, 2024

విద్యుత్ ఏఈపై సర్పంచులు ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

వర్ని : వర్ని మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో విద్యుత్ ఏఈ మాట్లాడుతుండగా విద్యుత్ స్తంభాలు కొత్తగా గ్రామాల్లో అవసరం ఉన్నా కూడా డబ్బులు కట్టిన విద్యుత్ స్తంభాలు వేయలేదని శ్రీనగర్ సర్పంచ్ రాజు, నారాయణ, నెహ్రునగర్ సర్పంచ్ ఉండవల్లి సత్తిబాబు, సత్యనారాయణ పురం సర్పంచ్ నాగమణి వీర్రాజు సభలో సర్పంచులు మాట్లాడుతూ మా గ్రామాల్లో విద్యుత్ సమస్యలు పరిష్కారమయ్యే వరకు విద్యుత్ బిల్లులు కట్టామని సర్వసభ్య సమావేశంలో కరాకండిగా తెలిపారు.

సమస్యలు పరిష్కారం కాకపోతే లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు కూడా నిర్వహిస్తామని వారు తెలిపారు. రెవెన్యూ అధికారికి సివిల్ సప్లైలో కొత్త వారికి రావడం లేదని తక్కువ ల్యాండ్ ఉన్న వారికి రేషన్ కార్డులు తీసేస్తున్నారని ఆర్‌ఐ దృష్టికి సర్పంచులు తీసుకెళ్లారు. అనంతరం పశువర్ధక శాఖ అధికారి పైడిమల్ సర్పంచ్ ఫోన్ చేస్తే కూడా స్పందిస్తాలేరని గ్రామాలలో గేదెలు రోగాల బారిన పడితే పశు వర్ధక శాఖ అధికారులు పశువులు చనిపోయిన తర్వాత స్పందిస్తారా అని అధికారులను నిలదీశారు.

అనంతరం విద్యుత్ శాఖ కుమారి మాట్లాడుతూ ఉపాద్యాయుల పోస్టులు 20 ఖాళీగా ఉన్నాయని సభ ముఖంగా తెలియజేశారు. విద్యాశాఖ అధికారులు కొత్త బిల్డింగ్ సమావేశాలకు నిర్మించాలని ఆమె కోరారు. జెడ్పిటిసి స్పందించి సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. మండలంలోని గ్రామాల్లో ప్రతి పాఠశాలలో పాఠ్య పుస్తకాలను పంపిణి చేశామని, కొన్ని పాఠశాలలో యూనిఫాంలో పంపిణీ జరగలేదని 75 శాతం యూనిఫాంలో పంపిణీ జరిగిందని, ప్రతి పాఠశాలలో నులి పురుగుల మాత్రలు విద్యార్థులకు పంపిణీ చేశామని ఆమె సభ ముఖంగా తెలిపారు.

అనంతరం వైద్యశాఖ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఆర్ అండ్ బి శాఖ అధికారులు సభలో మాట్లాడారు. సర్వసభ్య సమావేశం షెడ్యూల్ ప్రకారం 11 గంటలకు నిర్వహించాల్సింది ఉండగా సుమారు 11.50కి నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపిడివో, ఎంపిపి, జెడ్పిటిసి, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపిటిసిలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News