Tuesday, November 5, 2024

క్షయను గుర్తించడానికి సీరం సివై-టిబి ఇంజెక్షన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పొంచి ఉన్న క్షయను గుర్తించడానికి ఇంటింటికీ తమ సివై టిబి ఇంజెక్షన్ ద్వారా పరీక్షకు అనుమతించాలని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖను అభ్యర్థించింది. దేశం లోని ఏ ప్రభుత్వ ల్యాబ్ లోనూ ఈ ఇంజెక్షన్ ద్వారా పరీక్షించే సౌకర్యం లేదని వివరించారు. ఈమేరకు సీరం డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ ప్రభుత్వానికి బుధవారం లేఖ రాసినట్టు తెలిపారు. ఈ ఇంజెక్షన్ మార్కెట్‌లో విక్రయించడానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా 2022 మే 9న అనుమతించింది.

అనుమతించి ఏడాది అవుతున్నా ఏ ప్రభుత్వ ల్యాబ్‌లో పరీక్షకు తగిన సదుపాయం లేకపోవడంలో సివై టిబి ఇంజెక్షన్ మార్కెట్లో లభ్యం కావడం లేదని సింగ్ తన లేఖలో పేర్కొన్నారు. బయటపడకుండా పొంచి ఉన్న క్షయను గుర్తించడానికి సివైటిబి ఇంజెక్షన్ చాలా ముఖ్యమైనదని గుర్తు చేశారు. అందువల్ల ప్రభుత్వం ఇంటింటికీ ఈ పరీక్షకు అనుమతించాలని. దీనివల్ల దేశంలో ప్రపంచంలో ఇది ప్రజలకు అందుబాటు లోకి వస్తుందని అభ్యర్థించారు.

18 ఏళ్లు పైబడిన వారికి క్షయను గుర్తించేందుకు వీలుగా చర్మ పరీక్షకు సీరం సివై టిబి ఇంజెక్షన్‌కు డిజిసిఎ మార్కెట్ విక్రయం కోసం అనుమతించింది. 2030 నాటికి సుస్థిర అభివృద్ధిని సాధించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకున్నప్పటికీ, 2025 నాటికి పూర్తిగా క్షయను నిర్మూలిస్తామని ప్రభుత్వం అంకితమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News