Saturday, November 23, 2024

స్పుత్నిక్ టీకా తయారీకి ‘సీరం’ సిద్ధం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌వి కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. ఇందుకోసం గ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా (డిజిసిఐ) అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. అంతేకాకుండా పుణెలోని తమ ఉత్పత్తి కేంద్రంలో సుత్నిక్‌వి ప్రయోగ ఫలితాలను విశ్లేషించడానికి కూడా సంస్థ అనుమతి కోరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్‌డిఐఎఫ్) సహకారంతో గమలేయా సంస్థ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌వి వ్యాక్సిన్‌ను భారత్‌లో అభివృద్ధి చేయడానికి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఇప్పటికే ఆ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ కూడా ఈ వ్యాక్సిన్ తయారీ, సరఫరాకు ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్ వినియోగానికి డిజిసిఐ ఏప్రిల్‌లోనే అనుమతి ఇచ్చింది.

జులైనుంచి అక్కడ ఈ వ్యాక్సిన్ ఉత్పత్తికానుంది. ఈ లోగా రష్యానుంచి స్పుత్నిక్‌వి డోసులు దిగుమతి అవుతున్నాయి. తొలి దశలో 1.5 లక్షల డోసులు, రెండో విడతలో 60 వేల డోసులు వచ్చాయి. తాజాగా మూడో విడతలో 30 లక్షల డోసులు రష్యానుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాయి. దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత ఏర్పడిన నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీ సంస్థలు ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా జూన్‌లో 10కోట్ల కొవిషీల్డ్ డోసులను ఉత్పత్తి చేస్తామని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. వీటితో పాటుగా అమెరికాకు చెందిన నోవావాక్స్ డోసులను కూడా భారీ సంఖ్యలో అందుబాట్లుకి తేనుంది. అయితే ఇందుకు అమెరికా నియంత్రణ సంస్థల అనుమతుల కోసం ఎదురు చూస్తోంది.గత ఏప్రిల్‌లోనే డిజిసిఐ నోవావాక్స్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. తాజాగా స్పుత్నిక్‌వి వ్యాక్సిన్‌ను కూడా తయారు చేయడానికి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సన్నాహాలు చేస్తోంది.

Serum Institute ready for Sputnik V Manufacturing

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News