Monday, December 23, 2024

గర్భాశయ క్యాన్సర్‌కు సీరం స్వదేశీ వ్యాక్సిన్…

- Advertisement -
- Advertisement -

Serum Institute seeks govt nod to manufacture vaccine

తయారీకి అనుమతించాలని ప్రభుత్వానికి వినతి

న్యూఢిల్లీ : గర్భాశయ క్యాన్సర్ ను నివారించగల క్వాడ్రీవలెంట్ హ్యూమన్ పాపిలోమ వైరస్ (క్యూహెచ్‌పివి ) వ్యాక్సిన్‌ను స్వదేశీయంగా తయారు చేసి అందుబాటు లోకి తీసుకురాడానికి వీలుగా సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ అనుమతిని కోరింది. ఈ వ్యాక్సిన్‌ను తయారు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, దేశం లోని ప్రజలకు వీలైనంత త్వరగా అందుబాటు లోకి తెస్తామని సీరం తెలియజేసింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు సీరం ప్రభుత్వ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ లేఖ రావారు. మార్కెట్‌లో విక్రయించడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) నుంచి సీరం త్వరలో లైసెన్సు పొందనున్నది. ఏటా దేశంలో లక్షలాది మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్ ( కెర్వికల్ క్యాన్సర్) తో బాధపడుతున్నారని, మరణాల రేటు కూడా ఎక్కువగా ఉందని సీరం లేఖలో పేర్కొంది. భారత దేశంలో ప్రాణాంతక రెండో క్యాన్సర్‌గా గుర్తించడమైందని, 15 నుంచి 44 ఏళ్ల మహిళలు ఈ క్యాన్సర్ బాధితులవుతున్నారని వివరించింది. ఈ వ్యాక్సిన్ కోసం మనదేశం పూర్తిగా విదేశాలపై ఆధారపడుతోందని, ఎక్కువ ధరకు ఈ వ్యాక్సిన్‌ను రోగులు కొనుక్కోవలసి వస్తోందని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News