- Advertisement -
నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
మనతెలంగాణ/హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో సోమవారం రిజి స్ట్రేషన్‌లు నిలిచి పోయాయి. రాష్ట్రవ్యాప్తంగా స ర్వర్ డౌన్ కావడంతో రిజిస్ట్రేషన్‌లు జరగలేదని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తెలిపా రు. ప్రధానంగా డాక్యుమెంట్లు స్కానింగ్ చేయ డం, ప్రతి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌కు సబ్ రిజిస్ట్రా ర్లు బయోమెట్రిక్ ద్వారా లాగిన్ కావాల్సి ఉండగా అది కూడా పనిచేయలేదు. అదేవిధంగా రిజి స్ట్రేషన్ అయిన తర్వాత డాక్యుమెంట్లు స్కానింగ్ చేయడానికి అవకాశం కలగలే దని అధికారులు తెలిపారు. ఇలా రకరకాలుగా తలెత్తిన సాంకేతిక కారణాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 140 కిపైగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ఆగిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు.
- Advertisement -