Thursday, January 23, 2025

ఏఐసీటీఈ తో భాగస్వామ్యం చేసుకున్న సర్వీస్‌నౌ

- Advertisement -
- Advertisement -

ప్రముఖ డిజిటల్ వర్క్‌ఫ్లో కంపెనీ సర్వీస్‌నౌ, తమ సర్వీస్‌నౌ ప్లాట్‌ఫారమ్ పై మొదటి సంవత్సరంలో 10,000 మంది విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)తో ఈరోజు అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది. ఈ ఎంఓయూ మూడు సంవత్సరాలలో 25,000 మంది విద్యార్థులను నైపుణ్య వంతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చేసుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో మొదటి అడుగు.

భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న నైపుణ్యాలు, సామర్థ్యాలను అందిస్తూనే, ప్రపంచ, కేంద్రీకృత అభ్యాసాన్ని విద్యార్థులకు ఈ భాగస్వామ్యం అందిస్తుంది. ఈ ఎంఓయూ నౌ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌లో సర్వీస్‌నౌ అడ్మినిస్ట్రేటర్, డెవలపర్ కోర్సులను అందుబాటులోకి తీసుకురావటం ద్వారా నిరంతర విద్యా మార్గాన్ని సృష్టిస్తుంది. ముఖ్యముగా, విద్యార్ధులు అభివృద్ధి చెందుతున్న ఏఐ సాంకేతికతలకు పరిచయం చేయబడతారు, సంభావ్య ఉద్యోగులందరికీ అవసరమైన, విలువైన పరిజ్ఞానం అందిస్తారు. ఇది వేగవంతమైన డిజిటల్ కెరీర్ మార్గాలకు దారితీసే డొమైన్ నిర్దిష్ట నైపుణ్యాల ద్వారా సంపూర్ణంగా విద్యార్థులకు అభివృద్ధిని అందించే ఏఐసీటీఈ దృష్టికి అనుగుణంగా ఉంది.

సర్వీస్‌నౌ మరియు పియర్‌సన్‌ల తాజా పరిశోధన ప్రకారం, కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్‌ రంగంలో భారతదేశంలో 16.2 మిలియన్ల (సుమారు 1.6 కోట్లు) కార్మికులు పునః నైపుణ్యం మరియు అదనపు నైపుణ్యం పెంచుకోవాలి, అదే సమయంలో సాంకేతిక రంగంలో 4.7 మిలియన్ల కొత్త ఉద్యోగాలను కూడా సృష్టించాలి. అందువల్ల, డిజిటల్ యుగంలో వృత్తిపరమైన వృద్ధిని సాధించడానికి, అభివృద్ధి చెందడానికి పరిశ్రమల్లో డిజిటల్ అప్‌స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ కీలకం.

ఏఐసీటీఈ నాయకత్వాన్ని న్యూ ఢిల్లీ లో కలుసుకున్న అనంతరం సర్వీస్‌నౌలో చీఫ్ స్ట్రాటజీ, కార్పొరేట్ వ్యవహారాల అధికారి నిక్ ట్జిట్జోన్ మాట్లాడుతూ… “నేటి డిజిటల్ ఎకానమీలో అభివృద్ధి చెందడానికి అవసరమైన నైపుణ్యాలతో ఇంజినీరింగ్ విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ఏఐసీటీఈ తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సర్వీస్‌నౌ వద్ద మేము సంతోషంగా ఉన్నాము. సర్వీస్‌నౌ వద్ద మేము డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కు టాలెంట్ ట్రాన్స్‌ఫర్మేషన్ కీలకమని నమ్ముతున్నాము మరియు రైజ్‌అప్ విత్ సర్వీస్‌నౌ ప్రోగ్రామ్ ఉద్యోగానికి సిద్ధంగా ఉన్న యువ ఇంజనీర్‌లకు సాధికారత కల్పించడానికి రూపొందించబడింది. ఈ ఎంఓయూ భారతదేశం అంతటా ఏఐసీటీఈ అనుబంధ సంస్థలను భారతదేశంలో తదుపరి సాంకేతిక ఆవిష్కరణలను నడిపించే అర్హత కలిగిన ప్రతిభావంతుల సమూహాన్ని రూపొందించడానికి వీలు కల్పిస్తుంది” అని అన్నారు.

ప్రొఫెసర్ (డాక్టర్ ) టిజి సీతారాం, ఛైర్మన్-అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఎఐసిటిఇ) మాట్లాడుతూ.. మన విద్యార్థులు అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి సిద్ధంగా ఉన్నారని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యమైనదని, వారికి ఆధునిక నైపుణ్యాలు, వృత్తిపరమైన వృద్ధి అవకాశాలకు ఎక్కువ అవకాశాలను అందించడం అవసరం. సర్వీస్‌నౌతో మా భాగస్వామ్యం విద్యార్థులకు వారి అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్వేషించడానికి ప్రేరణతో పాటు వినూత్న భావనలు సాంకేతికతలలో అధునాతన శిక్షణను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భాగస్వామ్యం వారి భవిష్యత్తు విజయానికి అవసరమైన స్టూడెంట్ అప్ స్కిల్లింగ్, సాంకేతిక నైపుణ్యం పట్ల మా నిబద్ధతను నొక్కి చెబుతుంది” అని అన్నారు.

మారుతున్న ప్రపంచం కోసం విద్యార్థులను సిద్ధం చేయడం చాలా కీలకమని, సమకాలీన నైపుణ్యాలను అందించడం మరియు వృత్తిపరమైన అభివృద్ధికి మెరుగైన అవకాశాలను అందించటం అవసరమని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ బుద్ధ అన్నారు. సర్వీస్‌నౌతో భాగస్వామ్యంతో, మేము విద్యార్థులను సరికొత్త ఆలోచనలు, సాంకేతికతతో సన్నద్ధం చేయడం, వారి అవసరాలకు అనుగుణంగా కొత్త సాంకేతికతలతో నిమగ్నమయ్యేలా వారిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ భాగస్వామ్యం విద్యార్థుల నైపుణ్యాలు, సాంకేతిక అక్షరాస్యతను పెంపొందించడానికి మా అంకితభావాన్ని హైలైట్ చేస్తుంది, ఇది వారి భవిష్యత్తు విజయాలకు కీలకం” అని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌లో ఉన్న డిజిటల్ నైపుణ్యాలతో ఒక మిలియన్ మందికి నైపుణ్యం కల్పించడానికి రూపొందించబడిన గ్లోబల్ ప్రోగ్రామ్, సర్వీస్‌నౌ యొక్క రైజ్‌అప్ ప్రోగ్రామ్, భారతదేశంలో, సర్వీస్‌నౌ యూనివర్శిటీ అకడమిక్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది, 16 రాష్ట్రాలను కవర్ చేస్తూ, 20 విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం కలిగి ఉంది. వీటిలో ప్రభుత్వ భాగస్వామ్యాలు, ఫ్యూచర్‌స్కిల్స్ ప్రైమ్ నాస్కామ్, ఐసిటి అకాడమీ అఫ్ తమిళనాడు వంటివి వున్నాయి. వేలాది మంది విద్యార్థులకు ఉద్యోగానికి సిద్ధంగా ఉన్న ప్రతిభను అభివృద్ధి చేయడానికి శిక్షణ ఇచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా సర్వీస్‌నౌ యొక్క అభివృద్ధిని ఇండియా ప్రేరేపిస్తోంది, అన్ని టాప్ 10 టెక్నాలజీ ప్రొవైడర్‌లు, భారతదేశంలోని మొదటి ఐదు బ్యాంకులలో అత్యధికంగా సర్వీస్‌నౌ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నాయి. మేము పని చేసే విధానాన్ని మెరుగుపరచడంలో భారతదేశం యొక్క వ్యాపారాలు, సంస్థలు ముందంజలో ఉండటానికి సర్వీస్‌నౌను అమలు చేయడం గురించి తెలిసిన నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం పెరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News