ప్రముఖ డిజిటల్ వర్క్‌ఫ్లో కంపెనీ సర్వీస్‌నౌ ఇండియా, భారతదేశం అంతటా 5,000 మంది అభ్యాసకులకు కొత్త డిజిటల్ నైపుణ్యాలలో శిక్షణనిచ్చేందుకు, MeitY నాస్కామ్ డిజిటల్ స్కిల్లింగ్ కార్యక్రమం- ఫ్యూచర్‌స్కిల్స్ ప్రైమ్ తో తమ నైపుణ్యాల భాగస్వామ్యాన్ని ప్రకటించింది. సర్వీస్‌నౌ యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్న నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉన్న రివార్డింగ్ కెరీర్‌లను నిర్మించడానికి ఈ భాగస్వామ్యం స్పష్టమైన మార్గాలను అందిస్తుంది. “రైజ్‌అప్ విత్ సర్వీస్‌నౌ” కు మద్దతు ఇస్తుంది, 2024 చివరి నాటికి పది లక్షల మంది వ్యక్తులకు నైపుణ్యం అభివృద్ధి చేయాలనే లక్ష్యమిది.
ఈ కార్యక్రమం భారతదేశాన్ని గ్లోబల్ టాలెంట్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే భారత ప్రభుత్వ ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకు వెళ్ళనుంది. దీనితో పాటుగా అభ్యాసకులందరి కోసం పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంచేందుకు రెండు ఎంట్రీ-లెవల్ ఆన్-డిమాండ్ సర్వీస్‌నౌ కోర్సులను విడుదల చేయనుంది. వెల్కమ్ టు సర్వీస్ నౌ, సర్వీస్‌నౌ అడ్మినిస్ట్రేషన్ ఫండమెంటల్స్‌లో డిజిటల్ కెరీర్‌ని ప్రారంభించటానికి అవసరమైన సాంకేతిక మరియు వ్యక్తుల మధ్య నైపుణ్యాలు ఉంటాయి.
నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ & ట్రైనింగ్ (NVCET)చే ఆమోదించబడిన ప్రామాణికమైన, అధిక నాణ్యత కలిగిన వృత్తి, విద్యా వ్యవస్థను రూపొందించడానికి ఈ పాఠ్యప్రణాళిక నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ (NSQF)కి సమలేఖనం చేయబడింది. సర్వీస్‌నౌ అడ్మినిస్ట్రేషన్ ఫండమెంటల్స్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, వ్యక్తులు సర్వీస్‌నౌ సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ (CSA)గా సర్టిఫికేషన్ ఎగ్జామ్‌ను రాసేందుకు అర్హత పొందుతారు.
SSC NASSCOM, సీఈఓ కీర్తి సేథ్ మాట్లాడుతూ.. “భారత్‌ను డిజిటల్ గ్లోబల్ టాలెంట్ హబ్‌గా మార్చే ఫ్యూచర్‌స్కిల్స్ ప్రైమ్ విజన్ లక్ష్యాలకనుగుణంగా తమ ప్రయత్నాలను చేస్తున్న సర్వీస్‌నౌతో భాగస్వామ్యం చేసుకోవడం మాకు సంతోషంగా ఉంది. ఈ భాగస్వామ్యం, 1.3 మిలియన్ల ఫ్యూచర్‌స్కిల్స్ ప్రైమ్ లెర్నర్‌లకు తమ రెండు పరిశ్రమ సంబంధిత కోర్సులను చేరువ చేస్తుంది. ఈ కోర్సులు నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ (NSQF)కి సమలేఖనం చేయబడ్డాయి. విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్, వ్యక్తులకు బదిలీ చేయగల నైపుణ్యాలను అందిస్తాయి. ఇవి భారతదేశంలోని చిన్న పట్టణాల నుండి వారి సాంకేతిక సామర్థ్యాన్ని పెంపొందించడానికి, కెరీర్ నిర్మించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాయి” అని అన్నారు.
భారత ఉపఖండం, సార్క్ VP, మేనేజింగ్ డైరెక్టర్ కమోలికా గుప్తా పెరెస్ మాట్లాడుతూ, “అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల కోసం ప్రపంచ మార్కెట్ అవసరాలను తీర్చడానికి భారతదేశ శ్రామిక శక్తిని సిద్ధం చేయడం రాబోయే సంవత్సరంలో భారతదేశానికి అతిపెద్ద సవాలుగా నిలవటంతో పాటుగా అవకాశంగానూ నిలుస్తుంది” అని అన్నారు.
ఆర్థిక సేవలు, పబ్లిక్ సెక్టార్, టెలికమ్యూనికేషన్స్, తయారీ, డిజిటల్ స్థానిక పరిశ్రమల్లోని సర్వీస్‌నౌ కస్టమర్‌లతో నేను మాట్లాడుతున్నప్పుడు, అందరూ తమ సంస్థల్లో డిజిటల్ వర్క్‌ఫ్లోలను ప్రారంభించగల నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోవడం లేదా కాంట్రాక్ట్ చేయడం అనేది ఒక సాధారణ కీలక సవాలుగా నిలుస్తుందని వెల్లడించారు. ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ – MeitY nasscom డిజిటల్ స్కిల్లింగ్ కార్యక్రమం – ఈ క్లిష్టమైన వ్యాపార అవసరాన్ని పరిష్కరిస్తుంది. భారతదేశంలో భవిష్యత్-సన్నద్ధమైన వర్క్‌ఫోర్స్‌ను నిర్మించడానికి సర్వీస్ నౌ యొక్క దృష్టిని నిర్మిస్తుంది…” అని అన్నారు
సర్వీస్‌నౌ ఇండియా టెక్నాలజీ అండ్ బిజినెస్ సెంటర్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ సుమీత్ మాథుర్ ఈ భాగస్వామ్యంపై మాట్లాడుతూ.. “భారతదేశంలో మా నైపుణ్యత కార్యక్రమాలను విస్తరించేందుకు ఫ్యూచర్‌స్కిల్స్ ప్రైమ్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సర్వీస్‌నౌ వద్ద మేము సంతోషిస్తున్నాము. భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌తో వ్యూహాత్మకంగా అనుసంధానించబడిన నైపుణ్యాల-మొదటి ఆర్థిక వ్యవస్థను నిర్మించడంపై ప్రయత్నాలను కేంద్రీకరిస్తోంది, తద్వారా దేశాన్ని డిజిటల్‌గా శక్తివంతం చేస్తుంది.
టెక్ టాలెంట్‌కి గ్లోబల్ పవర్‌హౌస్‌గా మారడంలో భారతదేశానికి సహాయం చేయడంలో ఈ కార్యక్రమం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. నాస్కామ్‌తో కలిసి, సర్వీస్‌నౌ అవకాశాల అంతరంపై దృష్టి సారించడం ద్వారా ‘డిజిటల్ వర్క్‌ఫ్లో నైపుణ్యాలను’ అభివృద్ధి చేయడం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి పరిశ్రమకు సేవలందించే అర్ధవంతమైన డిజిటల్ కెరీర్‌లను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది.” అని అన్నారు.