Monday, December 23, 2024

గండిని పూడ్చటంలో అధికారులు, సిబ్బంది సేవలు భేష్ : దాస్యం వినయ్‌భాష్కర్

- Advertisement -
- Advertisement -

వరంగల్: భద్రకాలి చెరువుకు గండి పడిన నేపథ్యంలో బల్దియా ఇంజినీరింగ్, నీటిపారుదల, పోలీసుశాఖ అధికారులు, సిబ్బంది చెరువు గండిని ఎంతో శ్రమించి పూడ్చారని వారి సేవలు అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాష్కర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా భద్రకాళి చెరువుకు గండి పడటంతో సుమారు 70-80 మంది సిబ్బంది శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు నిర్విరామంగా రేయింబవళ్లు శ్రమించి ఆదివారం ఉదయం 6-30 వరకు గండిని పూడ్చారన్నారు. ప్రజలకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం కలగకుండా ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా అర్చకుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News