Friday, November 22, 2024

ప్రజలకు చేరువై సేవలు అందించాలి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : ప్రజలకు చేరువై సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నా రు. నాగర్‌కర్నూల్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన మహారాష్ట్ర బ్యాంకును లీడ్ బ్యాంక్ మేనేజర్, బ్యాంకు అధికారులతో కలిసి మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం బ్యాంకును సం దర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ జిల్లాలో మహారాష్ట్ర బ్యాంకు కార్యకలాపాలు మరింతగా విస్తరింపచేసి ప్రజలకు విస్తృత సేవలు అందించాలని కో రారు.

అలాగే ప్రభుత్వ పథకాలలో అర్హులైన వారికి రుణ ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశించిన లక్షాలను అధిగమించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హైదరాబాద్ జోనల్ మేనేజర్ సుశాంత్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హైదరాబాద్ జో న్‌లో నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో 54వ బ్రాంచ్‌గా ప్రారంభించుకున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో 25 జిల్లాలలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏర్పడిందని, మొత్తం భారతదేశ వ్యాప్తంగా 2400 బ్రాంచ్‌లు ఏర్పాటు అయ్యాయన్నారు.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండి, సిఈఓ ఏఎస్. రాజీవ్ ఇప్పటి వరకు 4.20 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న బిజినెస్‌ను మున్ముందు ఈ వ్యాపారాన్ని మార్చి 2024 నాటికి 5లక్షల కోట్లకు పెంచాలనే లక్షంగా సంస్థ ము ందుకెళ్తుందని అన్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అందరు రిటైలర్స్‌కి తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తుందని, సులభమైన ప్రాసెసింగ్‌తో ఇంటి రుణాలు, బంగారు రుణాలు తక్కువ వడ్డీతో ఇస్తుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చే సుకోవాలని ఆయన విఙ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌశల్ కిషోర్ పాండే, జోనల్ మేనేజర్ శుశా ంత్ కుమార్ గుప్తా, మహారాష్ట్ర బ్యాంకు మేనేజర్ ఎన్. రాకేష్, బ్యాంకు సిబ్బంది, పరమేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News