పరికరాలు, సిబ్బంది నియమిస్తున్న వైద్యశాఖ
ప్రతి దవఖానకు ముగ్గురు చొప్పన వైద్యసిబ్బంది నియామకం
నగరవాసులకు అందుబాటులో రానున్న 32 కొత్త బస్తీ దవాఖానలు
హైదరాబాద్: నగరంలో పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్న బస్తీ దవాఖానలు డిసెంబర్ రెండో వారంలో రోగులకు వైద్య సేవలందించేకు సిద్దమైతున్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. తగిన స్థాయిలో సిబ్బంది, వైద్య పరికరాలు ఏర్పాటు చేస్తున్నట్లు, జీహెచ్‌ఎంసీ కొత్తగా 32 దవాఖానలకు సంబంధించిన స్దల సేకరణ చేసి వైద్యశాఖకు అప్పగించిందని, వైద్యుల అందించాల్సిన సేవలపై ఏర్పాట్లు చేస్తున్నట్లు అదికారులు వెల్లడిస్తున్నారు. గ్రేటర్‌లో ప్రస్తుతం 226 దవఖానలు సేవలందిస్తుండగా, త్వరలో ప్రారంభించే దవాఖానలు అందుబాటులోకి వస్తే గ్రేటర్ పరిధిలో దవాఖానల సంఖ్య 258కి చేరుకుంటుంది. వీటి ద్వారా రోజుకు 3500 నుంచి 4500మందికి వైద్య చికిత్సలు అందించే అవకాశముందని ఆసుపత్రులు మెడికల్ ఆఫీసర్లు పేర్కొంటున్నారు.
రోజు రోజుకు ఆసుపత్రులకు రోగుల సంఖ్య పెరగడం, చలికాలం కావడంతో సీజనల్ వ్యాధులు, కరోనా మహమ్మారి విజృభించే సులువుగా ఎదుర్కొవచ్చంటున్నారు. ఒక బస్తీ దవఖానల్లో వైద్య చేసేందుకు ఒక డాక్టర్, స్టాప్ నర్సు, అటెండర్ విధులు నిర్వహిస్తారని, త్వరలో ఏర్పాటు చేయబోయే బస్తీ దవఖానల కోసం 96మంది సిబ్బంది నియమిస్తునట్లు వారిని ఒప్పంద పద్దతిన తీసుకోనున్నట్లు వెద్యాధికారులు వెల్లడించారు. డిసెంబర్ రెండో వారం నుంచి నూతనంగా ఏర్పాటు చేసే బస్తీదవఖానలు రోగులకు అందుబాటులో ఉంటాయని, పేద ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి లక్ష రూపాయలు ఖర్చు చేయాల్సి అవసరం లేదంటున్నారు. అదే విధంగా వ్యాధి నిర్దారణ కోసం ప్రస్తుతం 08 డయాగ్నస్టిక్ హబ్‌ల ద్వారా రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నాయని తెలిపారు.
మరో 08 డయాగ్నస్టిక్ హబ్‌లు కూడా జనవరిలోగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరిస్తున్నారు. మొత్తం 300 వరకు బస్తీ దవాఖానల ఏర్పాటు ప్రభుత్వ టార్గెట్ పెట్టగా కొత్త వాటితో మూడొంతల వరకు బస్తీ దవఖానలు ఏర్పాటు చేసినట్లు, ఏడాది మార్చి నాటికి పూర్తికి ఏర్పాటు చేసి ఆరోగ్య హైదరాబాద్ నగరానికి పేరు ప్రతిష్టలు చేస్తామని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. దవాఖానల పనితీరుపై ప్రారంభించిన ఏడాదిలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గుర్తించి ఉత్తమ అవార్డు అందజేసి, దేశంలోని వివిధ రాష్ట్రాలు బస్తీదవాఖానలపై అధ్యయనం చేయాలని సూచనలు చేసింది. బస్తీ దవాఖానాల ఏర్పాటు ద్వారా వైద్యఖర్చులు తగ్గి పేదల ఆర్దిక వ్యవస్ద మెరుగుపడిందని వైద్య రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు.