Wednesday, January 22, 2025

పాఠశాలలో మండల కార్యాలయాలు ఏర్పాటు చేయండి

- Advertisement -
- Advertisement -

రేగొండ: నూతనంగా ఏర్పాటైన గోరుకొత్తపల్లి మండల కార్యాలయాలను జెడ్‌పిఎచ్‌ఎస్ గోరుకొత్తపల్లి పాఠశాలలో తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పాటైన గోరుకొత్తపల్లి మండల కార్యాలయాల ఏర్పాటుపై శుక్రవారం కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. ఈసందర్భంగా నూతన మండల కార్యాలయాల భవనాలకు అనువైన స్థలం సేకరన చేసి భవనాల నిర్మాణాలు త్వరలోనే చేపట్టనున్నట్లు తెలిపారు. పర్నీచర్, కంప్యూటర్స్ ఇతరత్ర సా మాగ్రిని సమకూర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏడు గ్రామాలతో ఏర్పాటు అ వుతున్న మండలం కావున అన్ని గ్రామాలకు తెలియజేయాలని తెలిపారు. తహశీల్దార్ షర్బుద్దీన్, ఎంపిడిఒ సురేంరద్‌గౌడ్,ఆర్‌ఐ నరేష్‌కుమార్, సర్పంచి రజిత, ఎంపిటిసి హమీద్, తిరుపతిరావు, విష్ణుయాదవ్‌లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News