Wednesday, January 22, 2025

సుప్రీం కోర్టులో బిల్కిస్ బానో రివ్యూ పిటిషన్ కొట్టివేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బిల్కిస్ బానో రివ్యూ పిటిషన్‌ను శనివారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2002లో సామూహిక అత్యాచారం చేసి, కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో దోషులుగా తేలిన 11 మందిని ముందస్తుగా విడుదలచేయడాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో ఈ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో 11 మంది నిందితులు 2008లో దోషులుగా తేలారు. వారికి కోర్టు జీవిత ఖైధు విధించింది. కాగా వారు ఆగస్టు 15 ఆగస్టు గోద్రా సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. గుజరాత్ ప్రభుత్వం రిమిషన్ పాలసీ ప్రకారం వారిని విడుదల చేయాలని కోర్టు తీర్పు చెప్పింది.

2002లో గుజరాత్‌లో గోద్రా రైలు దహనం తర్వాత చెలరేగిన అల్లర్లలో పారిపోతూ సామూహిక అత్యాచారానికి గురైనప్పుడు బిల్కిస్ బానో వయస్సు 21 సంవత్సరాలు. అప్పుడామె ఐదు నెలల గర్భిణి. చనిపోయిన ఏడుగురు కుటుంబ సభ్యుల్లో ఆమె మూడేళ్ల కూతురు కూడా ఉంది. దోషుల ముందస్తు విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లకు ప్రతిస్పందనగా గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. 11 మంది దోషుల సత్ప్రవర్తనపై 14 సంవత్సరాల జైలు శిక్షను పూర్తి చేసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం ఆమోదం తర్వాత విడుదలయ్యారని తెలుపుతూ సుప్రీంకోర్టుకు గుజరాత్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News