Monday, January 13, 2025

కేజ్రీవాల్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు సోమవారం సుప్రీంకోర్టు ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలపై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దాఖలైన పరువునష్టం కేసులో తనకు జారీ అయిన సమన్లను కొట్టివేయడానికి గుజరాత్ హైకోర్టు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఇదే కేసులో ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టుకు చెందిన వేరే ధర్మాసనం కొట్టివేసిన విషయాన్ని జస్టిస్ హృషికేష్ రాయ్, విఎన్ భట్టితో కూడిన ధర్మాసనం పేర్కొంది.

తమ వైఖరి ఒకే తీరున ఉండాలని అభిప్రాయపడిన ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. ఈ కేసులో తమపై జారీ అయిన సమన్లను కొట్టివేయాలని కోరుతూ కేజ్రీవాల్, సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు ఫిబ్రవరి 16న కొట్టివేసింది. గుజరాత్ యూనివర్సిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై గుజరాత్‌లోని ప్రత్యేక కోర్టు గతంలో కేజ్రీవాల్‌కు, సంజయ్ సింగ్‌కు సమన్లు జారీచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News