Wednesday, January 22, 2025

అనిల్ అంబానీకి సుప్రీం కోర్టులో చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అతడికి ఆశానిపాతం అయింది. అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్కు చెందిన అనుబంధ సంస్థ అయిన ఢిల్లీ ఎయిర్ పోర్ట్ మెట్రో ఎక్స్ ప్రెస్ ప్రయివేట్ లిమిటెడ్ కు , ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కు రూ. 8000 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదంటూ సుప్రీం కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. అయితే ఈ కేసులో 2021లో తానే ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా పక్కనపెట్టింది. 2008లో డిఏఎమ్ఈపిఎల్, డిఎమ్ఆర్ సీలు ‘కన్సెషన్ ఒప్పందం’ కుదుర్చుకున్నాయి.

తాజాగా అనిల్ అంబానీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. తాజా తీర్పుతో అనిల్ అంబానీ కంపెనీ రూ. 1678.42 కోట్లు డిఎమ్ఆర్ సీకి ఇవ్వాల్సి ఉంటుంది. తనకు అందని రూ. 6330.96 కోట్లనూ వదులుకోవాల్సి ఉంటుంది. ఈ తీర్పు కారణంగా రిలయన్స్ ఇన్ ఫ్రా షేరు ధర బుధవారం బిఎస్ఈ లో 19.99 శాతం(లోయర్ సర్క్యూట్) పడిపోయి రూ. 227.40 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 2250.02 కోట్లు కోల్పోయి, రూ. 9008.02 కోట్లకు పరిమితమయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News