Monday, December 23, 2024

వారంలో సెట్ల తేదీలు ఖరారు..?

- Advertisement -
- Advertisement -

మార్చిలో నోటిఫికేషన్లు…జూన్‌లో పరీక్షలు

Degree 1st year exams from feb 28
మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే విద్యాసంవత్సరం వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్స్) తేదీలు వారంలో ఖరారయ్యే అవకాశాలున్నాయి. వారంలోగా ఎంసెట్ సహా అన్ని సెట్‌ల కమిటీలను నియమించి ఆ తర్వాత షెడ్యూల్ ఖరారు చేయనున్నట్లు తెలిసింది. ఇందుకు నోటిఫికేషన్లు మార్చిలో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 20 నుంచి మే 5 వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో జూన్‌లో ఎంసెట్, ఇసెట్, లాసెట్, ఎడ్‌సెట్ తదితర ప్రవేశాలు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటివరకు జెఇఇ మెయిన్, నీట్ వంటి జాతీయ పరీక్షల షెడ్యూల్ విడుదల కాలేదు. పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు దేశంలో కొవిడ్ పరిస్థితుల దృష్టా జాతీయ పరీక్షల షెడ్యూల్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయాకు సెట్లకు ఉన్నత విద్యామండలి కన్వీనర్లను నియమించగా, వారంలోగా సెట్ కమిటీలను నియమించనున్నారు. ఆన్‌లైన్ విధానంలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్న నేపధ్యంలో అందుబాటులో ఉన్న పరీక్షా కేంద్రాలను చూసుకుని తేదీలు ఖరారు చేయనున్నారు. విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యే ఎంసెట్‌ను గతంలో మాదిరిగానే కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కువ సెషన్లలో నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షలు నిర్వహించిన నెల తర్వాత అంటే జూలై లేదా ఆగస్టులో కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయి.
జూన్‌లో ఎంసెట్..?
వచ్చే విద్యాసంవత్సరం వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలను(సెట్స్) జూన్ నెలలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలన్నీ జూన్ నెలలో నిర్వహించి జూలైలో కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా జూన్ మొదటి వారంలో ఇసెట్ నిర్వహించి ఆ తర్వాత ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ విద్య కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రవేశాలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఎఐసిటిఇ) నిబంధనలకు అనుగుణంగా సెట్స్ షెడ్యూల్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఆలస్యంగా ప్రారంభం కానున్న విద్యాసంవత్సరం
కోవిడ్- 19 పరిస్థితుల నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం ప్రవేశాలు ఆలస్యంగా జరగడంతో పాటు తరగతులు కూడా ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయి. మార్చి నెల సమీపిస్తున్నా ఇంకా కొన్ని కోర్సులకు సంబంధించిన ప్రవేశాల ప్రక్రియ పూర్తి కాలేదు. వచ్చే విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. జూన్‌లో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే జూలై లేదా ఆగస్టులో కౌన్సెలింగ్ జరుగనుంది. ఆగస్టు చివరి నాటికి ప్రవేశాల ప్రక్రియ పూర్తయితే సెప్టెంబర్‌లో తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News