Sunday, February 23, 2025

ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరణకు కౌంటర్ ఏర్పాటు: గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్:  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థులుగా పోటీచేయాలనుకునే ఆశావహుల నుంచి నాంపల్లిలోని బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణకు కౌంటర్ ఏర్పాటు చేసినట్లు ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు. సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ సెప్టెంబరు 10వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తుల నమోదు జరుగుతుందన్నారు. మాజీ శాసనమండలి సభ్యులు రంగారెడ్డి , హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ జీ , రాష్ట్ర కార్యవర్గ దాసరి మల్లేశంతో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.

భారతీయ జనతా పార్టీ తరఫున పోటీలో నిలిచేందుకు అనూహ్య స్పందన లభిస్తోందని దరఖాస్తుల పరిశీలన కోసం స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా దరఖాస్తు ఫారంలో అభ్యర్థలు వివరాలు, గతంలో ఎక్కడి నుంచి పోటీ చేశారు పార్టీలో ప్రస్తుతం నిర్వహిస్తున్న బాధ్యతల గురించి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని వివరించారు. రాష్ట్ర పార్టీ ప్రాసెసింగ్ చేసిన తర్వాత రాష్ట్ర కమిటీ నుంచి జాతీయ కమిటీకి జాబితా పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News