Wednesday, January 22, 2025

ఐటి హబ్ ఏర్పాటు సిద్దిపేటకే తలమానికం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: ఐటి హబ్ ఏర్పాటు సిద్దిపేటకే తలమానికమని జిల్లా బిఆర్‌ఎస్‌వి అధ్యక్షుడు మెరుగు మహేశ్ అన్నారు. సోమవారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 15న ఐటి హబ్ ప్రారంభానికి సిద్ధ్దం కావడం గోప్ప శుభ పరిణామమన్నారు. ఈ అవకాశం కల్పించిన సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావులకు బిఆర్‌ఎస్వి పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో ఐటి హబ్‌లో 11 కంపెనీల ద్వారా రెండు సిప్ట్‌ల వారిగా 1600 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని తెలిపారు.

నేడు పోలీస్ కన్వెన్షన్ హాల్‌లో మెగా జాబ్ మేళా కార్యక్రమం ఉందని దీనిని టెక్నాలజీ విద్యా అర్హత కలిగిన విద్యార్థ్ధి యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 15న ఐటి హబ్ ప్రారంబోత్సవానికి పెద్ద ఎత్తున విద్యార్థ్ధి యువత తరలిరావాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్యామ్, మహిపాల్‌గౌడ్, నరేశ్ యాదవ్, శ్రీకాంత్, రాజు, సతీష్ , రమేశ్, రాములు, సతీష్, మధు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News