Monday, December 23, 2024

విదేశాల్లో భారతీయ ఐఐటి క్యాంపస్‌ల ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

Setting up of Indian IIT campuses abroad

సానుకూలంగా స్పందించిన నిపుణుల కమిటీ
ఇండియా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా పేరు పెట్టవచ్చు
ఇక్కడినుంచి ఫ్యాకల్టీని కూడా పంపించవచ్చు
నివేదికలో సిఫార్సు చేసిన రాధాకృష్ణన్ కమిటీ

న్యూఢిల్లీ: దేశంలోనిప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలయిన ఐఐటిలు తమ కార్యకలాపాలను విదేశాలకు విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చ్సేకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐఐటిలు విదేశాల్లో ఏర్పాటు చేయబోయే క్యాంపస్‌లను ‘ఇండియా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ పేరుతో పిలవవచ్చని, ఇక్కడి ఆ ఐఐటికినుంచి బోధనా సిబ్బందిని డిప్యుటేషన్‌పైన విదేశాలకు పంపవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. అంతేకాదు విదేశాల్లోని ఐఐటిలకు తమ సంస్థలో ఎంత మంది విద్యార్థులు ఉండాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుందని, అయితే ఆ సంస్థల్లో ఉండే భారతీయ విద్యార్థుల సంఖ్య మాత్రం మొత్తం విద్యార్థుల్లో 20 శాతంకంటే తక్కువ ఉంటుందని కూడా ఆ వర్గాలు తెలియజేశారు.

ఐఐటిల అంతర్జాతీయ విస్తరణకు సంబంధించి కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. విదేశాల్లో ప్రారంభించబోయే ఐఐటి యాజమాన్య హక్కు ఇక్కడి సంబంధిత ఐఐటికే ఉండాలని, కొత్తగా ఏర్పాటు చేసే సంస్థలను ‘ఆ లొకేషన్‌కు చెందిన ఇండియన్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’గా పిలవవచ్చని ఆ నివేదిక సూచించిందని ఆ వర్గాలు తెలిపాయి. అంతేకాదు ఇక్కడ ఉన్న ఐఐటినుంచి ఫ్యాకల్టీని విదేశాల్లోని సంస్థకు డిప్యుటేషన్‌పై పంపించే వీలు ఉండాలని, దీనివల్ల ఆ సంస్థ ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ అనుభవంనుంచి గణనీయస్థాయిలో లబ్ధి పొందే వీలు ఉంటుందని ఆ నివేదిక అభిప్రాయపడింది.

తమ దేశాల్లో క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని మన దేశంలోని ఐఐటిలకు మధ్యప్రాచ్యం, తూర్పు ఆసియాకు చెందిన పలు దేశాలనుంచి అభ్యర్థనలు వస్తున్నాయి, యుఎఇలో కా్ంయపస్‌ను ఏర్పాటు చేసే విషయాన్ని ఐఐటి ఢిల్లీ పరిశీలిస్తుండగా , శ్రీలంక, నేపాల్, టాంజానియాలలో క్యాంపస్‌లను ఏర్పాటు చేసే అవకాశాలను ఐఐటి మద్రాసు పరిశీలిస్తోంది. విదేశాలకు తన కార్యకలాపాలను విస్తరిచాలని ఐఐటి ఢిల్లీ అనుకోవడం ఇది రెండోసారి. ఇంతకు ముందు మారిషస్‌లో ‘ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రిసెర్చ్ అకాడమీ’ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించి మారిషస్ రిసెర్చ్ కౌన్సిల్‌తో అవగాహనా ఒప్పందంపై సంతకాలు కూడా చేసింది. అయితే 2014లో అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆ ఆలోచనను విరమించుకుంది. దేశంలోని ఐఐటిలు విదేశాల్లో ఏర్పాటు చేయడానికి సంబంధించి కేంద్రం ఈ ఏడాది ప్రారంభంలో ఐఐటి కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్ డి రాధాకృష్ణన్ నేతృత్వంలో 17 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

ఇప్పుడున్న ఐఐటి చట్టంప్రకారం దేశం వెలుపల క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి వీలు లేనందున విదేశాల్లో పలు ఐఐటి క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి వీలుగా ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆ కమిటీ సిఫారు చేసింది. కాగా విదేశాల్లో ఏర్పాటు చేయబోయే క్యాంపస్ పేరులో ఇంటర్నేషనల్ అనే పదాన్ని చేర్చడం వెనుక హేతుబద్ధతను వివరిస్తూ దీనివల్ల అది విదేశాల్లో ఉన్న సంస్థ అనే స్పష్టత ఉంటుందని ఆ కమిటీ పేర్కొంది. కాగా విదేశాల్లోని ఐఐటిలు సెమిస్టర్ విధానాన్ని పాటించవచ్చని, విద్యాసంవత్సర క్యాలెండర్‌కు అనుగుణంగా ఈ సెమిస్టర్ల ముగింపు తేదీలు ఉండవచ్చని కూడా ఆ కమిటీ పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News