Wednesday, January 8, 2025

వివిధ కోర్సుల్లో సెట్విన్ ఉచిత శిక్షణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: స్వయం ఉపాధి నైపుణ్యాభివృద్ధికి వివిధ కోర్సుల్లో ప్రభుత్వం అందిచనున్న ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని శిక్షణ సమన్వయ కర్త నాగేశ్వరరావు విద్యార్ధిని, విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని సెట్విన్ తెలంగాణ భవన నిర్మాణ కార్మిక శాఖ సంయుక్తంగా కార్యాచరణతో రూపొందించి అమలు చేస్తున్నారు. 46 కోర్సుల్లో యాప్ ద్వారా ఉచిత ఆన్లైన్ శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలను అందిస్తుంది.

ఉచిత ఆన్లైన్ శిక్షణకు సెట్విన్, తెలంగాణ భవన నిర్మాణ కార్మిక శాఖ వారితో కలిసి గవర్నమెంట్ జూనియర్ కళాశాల కూకట్‌పల్లిలో శనివారం హైదరాబాద్ జిల్లా లో నమోదై ఉన్నా కార్మికుల పిల్లలకు ఉచిత కెరీర్ గైడెన్స్ , రెజ్యూమ్ ప్రిపరేషన్ వర్క్ షాప్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వి కోఆర్డినేటర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్ధిని విద్యార్ధులతో సంస్థ ఉచితంగా ఇచ్చే విద్యా కోర్సులను వినియోగించుకొని మంచి భవిష్యత్తు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు లీడ్ జి సూరిబాబు హాజరుకాగామొత్తము 85 మంది విద్యార్ధిని విద్యార్ధులకు సర్టిఫికెట్లు అందజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News