Wednesday, February 19, 2025

సేవాలాల్ బంజారాలకు గురువు, దైవం

- Advertisement -
- Advertisement -

బంజారాల విశ్వగురు సేవాలాల్ మహారాజ్ భారత్ దేశంలో సుమారు 12 నుంచి 15 కోట్లు, తెలంగాణలో 30 లక్షల బంజారాలు దైవంతో సమానంగా భావించే సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని దేశంలో, విదేశాలలో ఉండే బంజారా జాతి ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. బంజారా జాతి దిక్సూచి, మార్గదర్శి, ఆధ్యాత్మిక గురువు, తాత్వికవేత్త బంజారా జాతి సాధకబాధలను ముందే పసిగట్టి జాతి ప్రజలను జాగ్రత్త పరిచారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఫిబ్రవరి 15న 1739 నాడుఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రాంజీ నాయక్ తండా గుత్తి, బళ్లారి ప్రాంతంలో తండ్రి భీమా నాయక్, తల్లి ధర్మనిభాయీ దంపతులకు జన్మించారు.

సేవాలాల్‌కు జగదాంబ మాతకి మధ్య జరిగిన కొన్ని సంభాషణలను బంజారాలు బాగా విశ్వసిస్తారు. అది ఒక చిన్న కథ రూపంలో విందాం. సేవాలాల్ తండ్రి భీమా నాయకు జగదాంబ మాత ప్రత్యక్షమై సేవాలాల్‌ను నాకు అప్పజెప్పమని కోరుతుంది, సేవాలాల్ దాన్ని ఒప్పుకోరు. నేను శాకాహారిని, జగదాంబ మాత మాంసాహారి కనుక నేను ఎలాంటి జీవాలను బలి చేయదలచుకోలేదని కారాఖండిగా చెప్తారు. అప్పుడు మేరమ్మ సేవాలాల్‌కు ఎన్నో కష్టాలకు గురిచేస్తుంది. అయినా సేవాలాల్ చలించడు.

చివరకు తండాలను అమ్మవారు కష్టాలపాలు చేస్తుంది. ఇదంతా సేవాలాల్ వల్లనే జరుగుతుందని తండవాళ్లు తండా రాజ్యం నుంచి సేవాలాల్ ను బహిష్కరిస్తారు. తండావాసులు అందరూ అమ్మవారికి మేకలను బలిస్తే శాంతిస్తుందని ఏడుగురు అమ్మవారులకు ఏడుగురు మేకలను బలి చేస్తారు. కానీ సేవాలాల్ దీన్ని ఒప్పుకోడు. ఇది ఒక మూఢ నమ్మకమని భావించి అమాయక మూగజీవులను బలి చేస్తా ఉంటే చూడలేక ఒకవేళ అమ్మవారికి బలే ఇష్టమైతే నేనే బలైపోతానని సేవాలాల్ తండా ప్రజల సమక్షంలో తన తలను ఖండించుకొని అమ్మవారి కాళ్ళ దగ్గర పడేస్తారు. నా రక్తాన్ని నైవేద్యంగా స్వీకరించి బంజారాలకు వరాలు ఇచ్చి ఆదుకోమని ప్రార్థిస్తాడు.

జగదాంబ మాత సేవాలాల్ శిరస్సును తిరిగి అతని శరీరానికి జోడించి జీవం పోస్తుంది. ఇన్నాళ్లు నేను పెట్టే పరీక్షలో సేవాలాల్ నెగ్గాడు నిజమైన భక్తుడు, సమాజానికి సేవకుడు, ఆయన నాయకత్వంలో బంజారా ప్రజలు ప్రయాణించండి అని జగదాంబ మాత ఆశీర్వదిస్తుంది. అప్పటి నుండి సేవాలాల్ జగదాంబ మాతనే తన మార్గదర్శకురాలిగా, గురువుగా స్వీకరించి అన్ని విద్యలను నేర్చుకుని బంజారాలకు సేవ చేయడంలో నిమగ్నమైనారు. నిజాం పాలనలో కొన్ని నియంత్రణలు ఉండేవి, అందులో హిందూ సంప్రదాయాలకు విరుద్ధంగా కొన్ని ఆదేశాలు ఉండేవి. గోవధ నియంత్రణ లేకుండా గోవులను వధించడం ఆ పాలనలో ఓ సమస్యగా మారింది.

జంగి బంగి భూక్య అనే నాయకులు గోవులను రక్షించడానికి ముందుకు వచ్చారు. వీరు నిజాం ప్రాంతంలోని ఆదివాసీ తెగలకు చెందినవారు. వీరు ధర్మానికి కట్టుబడి, తమ సంప్రదాయాలను కాపాడాలని నిర్ణయించుకున్నారు. కానీ నిజాం పాలకులు గోవుల సంరక్షణకు వ్యతిరేకంగా ఉండటంతో, వీరి ప్రయత్నాలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో జంగి బంగి భూక్య, ఆయన అనుచరులు సేవాలాల్ మహారాజ్‌ను ఆశ్రయించారు. వారు మహారాజ్‌ను కలిసి మా గోవులను రక్షించండి, పాలకుల నుంచి మేము అన్యాయానికి గురవుతున్నాం అని వేడుకున్నారు. సేవాలాల్ మహారాజ్ ధర్మపరిరక్షణకర్త కాబట్టి, ఆయన వారికి సహాయంగా నిలిచారు.

సేవాలాల్ మహారాజ్ ప్రభావం పెరుగుతుండటంతో నిజాం పాలకులకు ఆయనకు వ్యతిరేకంగా కుట్ర పన్నాలనిపించింది. అందుకోసం మహారాజ్‌కు విషం కలిపిన ఆహారం అందించాలని నిర్ణయించారు. అమ్మవారి వరంతో విషం అమృతం అవుతుంది. అయితే సేవాలాల్ మహారాజ్ అమ్మవారి కృపతో రక్షణ పొందారు. ఆయనకు భక్తులు అందించే భోజనంలో విషం కలిపినా, అది ఆయనకు అమృతంగా మారిపోయింది. ఇది చూసి నిజాం పాలకులు ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన తర్వాత, నిజాం పాలకులు సేవాలాల్ మహారాజ్ గొప్పతనాన్ని అంగీకరించి, ఆయనపై మరింత గౌరవం చూపారు. సంతి శ్రీ సేవాలాల్ మహారాజ్ ప్రవచనాలు ముఖ్యంగా

డాక్టర్ శంకర్ నాయక్

9110716874

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News