Wednesday, January 22, 2025

రాజకీయ పార్టీలకు సేవాలాల్ సేన డిమాండ్

- Advertisement -
- Advertisement -

15 జనరల్ స్థానాల్లో గిరిజనులకు టికెట్లు ఇవ్వాలి

మన తెలంగాణ / హైదరాబాద్ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు గిరిజన జనాభా అధికంగా ఉన్న 15 జనరల్ స్థానాల్లో గిరిజనులకు ఎంఎల్‌ఎ టికెట్టు కేటాయించాలని సేవాలాల్ సేన డిమాండ్ చేసింది. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సేన రాష్ట్ర అధ్యక్షులు అంగోత్ రాంబాబు నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ సేన 9వ ఆవిర్భావ దినోత్సవ జెండా ఆవిష్కరణ సభలు తెలంగాణలోని ప్రతి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి సేవాలాల్ సేన రాష్ట్ర కమిటి ఆయా జిల్లా కమిటీలకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. జిల్లాలో జరిగే కార్యక్రమానికి రాజకీయాలకు అతితంగా గిరిజన మేధావులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, విధ్యావంతులు, విధ్యార్థులు, మహిళలు, ఉద్యోగులను ఆహ్వానించనున్నట్లు తెలిపారు.

గిరిజన జాతి మనుగడ సాధనే లక్ష్యంగా జిల్లాలోని సేవాలాల్ సేన తండా కమిటీ నాయకులు, గ్రామ కమిటీ నాయకులు, మండల కమిటీ నాయకులు, పట్టణ కమిటీ నాయకులు, జిల్లా కమిటీ నాయకులు, అనుబంధ కమిటీ నాయకులు ప్రతి ఒక్కరు అధిక సంఖ్యలో పాల్గోని సేవాలాల్ సేన 9వ ఆవిర్భావ జెండా ఆవిష్కరణ సభలను జయప్రదం చెయాలన్నారు. ఈ కార్యక్రమానికి ఆయా జిల్లాలో ఉన్న సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ నాయకులు ఆతిధులుగా హాజరవుతారని తెలిపారు.

గత రెండు సంవత్సరాల్లో సేవాలాల్ సేన అనేక కార్యక్రమాలు చేపట్టి విజయాలు సాధించిందని యువకులు,విద్యార్థులు కార్మికుల కోసం రైతుల కోసం ఉద్యోగుల కోసం, ముఖ్యంగా మహిళల పై జరుగుతున్న అఘాయిత్యాలు, సాంస్కృతిక సాంప్రదాయ తదితర అనేక అంశాలపై సేవాలాల్ సేన పోరాటం చేసిందని తెలిపారు. హక్కుల సాధన కోసం దృఢ సంకల్పంతో యువత భవిష్యత్తు కోసం జాతి మనుగడ, సంస్కృతి సాంప్రదాయాల కోసం నిర్విరామంగా పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మండల కమిటీలు గ్రామ కమిటీలు సంపూర్ణంగా నియమించాలని, అన్ని అనుభందకమిటీల నిర్మాణంలో ఆయా జిల్లా అధ్యక్షులు ముఖ్య పాత్ర పోషించాలని సభ్యులందరు రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన నాయకులు, సేవాలాల్ సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎస్. పి నాయక్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రఘురాం రాథోడ్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు రేఖ నాయక్, దీపావళి పరశురాం నాయక్, ధరావత్ తారచంద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News