Monday, December 23, 2024

హత్యాయత్నం కేసులో అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Seven Arrested in attempted murder case
ఏడుగురిని అదుపులోకి తీసుకున్న బేగంపేట పోలీసులు
శనివారం రాత్రి యువకుడిని కత్తితో పొడిచిన నిందితులు
వివరాలు వెల్లడించిన అదనపు సిపి డిఎస్ చౌహాన్

హైదరాబాద్: యువకుడిపై కత్తితో దాడి చేసి హత్యచేసేందుకు యత్నించిన ఏడుగురు యువకులను బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు. నార్త్‌జోన్ డిసిపి ఆఫీస్‌లో నగర అదనపు పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహన్ ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్, రసూల్‌పురా, ఉప్పలమ్మ టెంపుల్‌కు చెందిన వేలూరు ప్రదీప్‌కుమార్ కార్జానాలోని కాకాగూడలో ఉంటున్నాడు. తన స్నేహితుడు రాఘవేంద్రను కలిసేందుకు హేమంత్‌కుమార్, శివ, భరత్‌కుమార్, అరుణ్, నవీన్‌తో కలిసి ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటలకు రసూల్‌పురకు వచ్చాడు. అక్కడి రామలింగేశ్వర టెంపుల్ వద్ద ఉండి తన స్నేహితుడు రాఘవేంద్రకు ఫోన్ చేశాడు. కాని అతడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అదే సమయంలో అక్కడికి ఎండి ఒమర్, ఖాజాబహుద్దిన్ హమీదీ అలియాస్ మునీర్, దసర్‌వాడ్ కృష్ణ వచ్చాడు. ఇక్కడ ఎందుకు నిల్చున్నావని ప్రశ్నించి వాగ్వాదానికి దిగారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లి పోవాలని ఒమర్ ప్రదీప్‌కు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయాడు. దీంతో అక్కడి నుంచి ప్రదీప్‌కుమార్, హేమంత్ మిగతా స్నేహితులు అక్కడి నుంచి బైక్‌పై వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లేందుకు శాంతమ్మ హోటల్, అన్నా నగర్ మీదుగా వెళ్తు ఇలాహీ మజీద్ వరకు రాగానే ఎండి ఒమర్ వచ్చి ప్రదీప్ బైక్‌ను ఆపివేసి వాగ్వాదానికి దిగాడు.

ఒమర్‌కు ప్రదీప్‌కు గతంలో పరిచయం ఉండడంతో డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరాడు. దానికి ప్రదీప్ నిరాకరించడంతో గొడవ ఎక్కువ అయి కత్తి పోట్లకు దారితీసింది. అదే సమయంలో ఖాజా బహుద్దిన్ హమీదీ అలియాస్ మునీర్ ఆటోడ్రైవర్, మహ్మద్ ఒమర్, అబ్దుల్ సమీ, ఎండి కరీం, ఎండి సోహైబ్, దసర్‌వాడి కృష్ణ, సయిద్ సమీర్ వచ్చారు. ప్రదీప్ కుమార్, ఒమర్ మధ్య వాగ్వాదం జరుగుతుండగానే ఖాజా బహుద్దిన్ అలియాస్ మునీర్ ఇంట్లో నుంచి కత్తి తీసుకుని వచ్చి ప్రదీప్‌కుమార్ కడుపులో పొడిచాడు. మిగతా వారు ప్రదీప్, హేమంత్‌ను కొట్టడం ప్రారంభించారు. వారిని అక్కడ పడేసి వెళ్లిపోయారు, ఇద్దరు అక్కడి నుంచి నేరుగా బేగంపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ప్రదీప్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బేగంపేట పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News