Saturday, November 23, 2024

మైన్‌పురి పార్లమెంటు స్థానానికి ఏడుగురి నామినేషన్లు తిరస్కృతి

- Advertisement -
- Advertisement -

లక్నో(యూపి): మైన్‌పురి పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో శనివారం పరిశీలన తర్వాత 13 మంది నామినేషన్లలో ఏడుగురి నామినేషన్లను తిరస్కరించినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. దీంతో ఈ ఉప ఎన్నిక పోటీ ప్రధానంగా సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి డింపుల్ యాదవ్, బిజెపి అభ్యర్థి రఘురాజ్ సింగ్ శాక్యా మధ్యే ఉండనుందని భావిస్తున్నారు. అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోడానికి చివరి తేదీ నవంబర్ 21. పార్టీ స్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కోటగా ఉన్న స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని సమాజ్‌వాదీ లక్షంగా పెట్టుకుంది. అందుకు అఖిలేశ్ యాదవ్, ఆయన చినాన్న శివ్‌పాల్ యాదవ్ కూడా కృషి చేస్తున్నారు. శివ్‌పాల్ ఎస్పీవైపు మొగ్గడం బిజెపికి దెబ్బగా ఉంది. శాక్యా తనకు ఆయన మద్దతు ఇస్తారేమోనని ఇన్నాళ్లు ఆశ పెట్టుకున్నారు. కాగా మైన్‌పురి స్థానం గెలుచుకుంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో యూపిలో మొత్తం 80 పార్లమెంటు సీట్లు గెలుచుకోవచ్చన్న భావనతో బిజెపి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News