- Advertisement -
తమిళనాడు లోని తిరువణ్ణామలైలో అన్నామలయార్ కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు లోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటివరకు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మూడు ఇళ్లపై కొండచరియలు విరిగి పడటంతో ఈ విషాదం సంభవించింది. 1965 నుంచి ఇప్పటివరకు ఈ జిల్లాలో తొలిసారిగా భారీ వర్షపాతం నమోదైందని మంత్రిఈవీ వేలు పేర్కొన్నారు. మరికొన్ని కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉండడంతో 50 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సేలం లోని యెర్కాడ్‌లో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి.
- Advertisement -