Monday, December 23, 2024

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Seven died in road accident at Belagavi

బెంగళూరు: కర్నాటకలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బెళగావి సమీపంలో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు కూలీలు మృతి చెందారు. మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్త సమీప ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బాధితులందరూ భవన నిర్మాణ కార్మికులుగా పోలీసులు గుర్తించారు. పని కోసం బెళగావి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News