Thursday, January 23, 2025

డ్రగ్స్ విక్రయిస్తున్న ఏడుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః డ్రగ్స్ విక్రయిస్తున్న ఏడుగురు నిందితులను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి హాష్ ఆయిల్ 310 మిల్లీ లీటర్లు, చెరస్ 70 గ్రాములు, బైక్, ఎనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్, గోల్కొండకు చెందిన సయిద్ ముజఫర్ అలీ, అబూబాకర్ బిన్ అబ్దుల్ అజిజ్, ఎండి ఖాసీం, సయిద్ ముర్తజా అలీ హుస్సేన్, ముబాషీర్ ఖాన్, నితిన్ గౌడ్, పూనం కుమారీ కౌర్, జీషాన్ నవీద్, సయిద్ అన్వరుల్లా హుస్సేనీ ఖాద్రీ కలిసి హాష్ ఆయిల్ విక్రయిస్తున్నారు. ఇందులో జీషాన్ నవీద్, సయిద్ అన్వరుల్లా హుస్సేనీ ఖాద్రీ పరారీలో ఉన్నారు. గోల్కొండకు చెందిన సయిద్ ముజఫర్ అలీ పదోతరగతి ఫేయిల్ అయ్యాడు.

చిల్లరగా తిరుగుతూ డ్రగ్స్‌కు బానిసగా మారాడు. అబూబాకర్ కూడా డ్రగ్స్‌కు బానిసగా మారాడు. ఇద్దరు కలిసి తమ స్నేహితుడు ఎండి ఖాసీంను ఎపిలోని పాడేరుకు పంపించాడు. అక్కడ లిటర్ హాష్ ఆయిల్‌ను రూ.80,000లకు కొనుగోలు చేసి తీసుకుని వచ్చారు. దానిని చిన్న బాటిళ్లలో 5 మిల్లీ లీటర్ల చొప్పున నింపి అవసరం ఉన్న వారికి రూ.2,000 చొప్పున విక్రయిస్తున్నారు. వీరి వద్ద జీషాన్ నవీద్, సయిద్ అన్వరుల్లా హుస్సేనీ ఖాద్రీ, సయిద్ మూర్తజా అలీ హుస్సేనీ, నితిన్ గౌడ్, పూనం కుమారీ కౌర్ కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. వీరు రూ.2,000లకు కొనుగోలు చేసి రూ.3,000లకు విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలిసి పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ ఖలీల్ పాషా, తెస్సై షేక్ కవిద్దిన్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News